మందు తాగి పోలీసులకు చిక్కిన యువతి

శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఓ యువతి బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా పోలీసులకు చుక్కలు చూపింది.

వీకెండ్‌లో డ్రంకన్ డ్రైన్ నిర్వహించే పోలీసులకు కొందరు మందుబాబులు చుక్కలు చూపిస్తున్నారు. శనివారం రాత్రి మద్యం తాగి దొరికిన యువతి పోలీసులపై వాగ్వాదానికి దిగింది.

హైదరాబాద్ నగరంలో రోడ్డుప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికిపోతున్న వారు మాత్రం బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా చుక్కలు చూపిస్తున్నారు.

శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఓ యువతి బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా పోలీసులకు చుక్కలు చూపింది.

మహిళా కానిస్టేబుల్‌ ఆమెకు పరీక్ష చేయడానికి దాదాపు అర గంటకుపైగా కష్టపడాల్సి వచ్చింది.

పక్కనున్న ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవ పెట్టకుంది. వారు ఎంత వారించినా ఆమె వినలేదు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

చివరికి ఆమెను పరీక్షించగా మద్యం మోతాదు 44 పాయింట్లు వచ్చింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత మరో యువకుడు సైతం ఇలానే పోలీసులకు చుక్కలు చూపాడు. శనివారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మొత్తంగా 9 కార్లు, 6 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పంజాగుట్ట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశామని వీరంతా సోమవారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉందన్నారు.

ఆ తర్వాత వీరిని కోర్టులో ప్రవేశపెడతామన్నారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు సహకరించని ఘటనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *