ఓకే సీటుకు పోటీ చేస్తున్న తండ్రి తనయులు.. తండ్రి టిడిపి నుంచి… తనయ కాంగ్రెస్ నుంచి…

ఐదేళ్ల పాలన తర్వాత కూడా.. చాలామందిని ఫిరాయింపు చేసుకున్నాక కూడా. ఇప్పటికీ కొన్ని సీట్లకు వేరే పార్టీల నుంచి అభ్యర్థులను తెచ్చుకోవలసిన అవసరం ఏర్పడింది టిడిపి పార్టీకి.

అది కూడా కాంగ్రెస్ లో ఉండి. తెరమరుగు అయిపోయిన నేతలను తెలుగుదేశం మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. అలాంటి వారిలో ఒకరు అరుగు మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

మరి ఆయన తెలుగుదేశం నుంచి బరిలోకి దిగి పోతుంటే స్వయానా నా కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కిషోర్ చంద్రదేవ్ కూతురు శృతి దేవి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు దరఖాస్తు పట్టుకున్నట్లు సమాచారం. అరకు ఎంపీ టికెట్ ను తనకు కేటాయించాలని అడిగిందట.

రాజకీయాల్లో తండ్రి కూతురులు,తండ్రి కొడుకులు వేరే వేరే పార్టీల తరఫున పోటీ చేయడం మనకు కొత్తేమీ కాదు.

అయితే ఓకే సీటుకు ఇలాంటి వాళ్లు ఢీకొన్న పరిస్థితులు చాలా తక్కువ.

ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫు కిషోర్ చంద్ర దేవ్ , కాంగ్రెస్ నుంచి శృతి దేవి పోటీ చేస్తే కనుక.. అది ఆసక్తిదాయకమైన విషయం గా మారుతుంది.

కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే ఏపీ లో డిపాజిట్ దక్కించుకోవడం కూడా కష్టమే అయినా.. తండ్రీ కూతుళ్ళు పోటీ ఆసక్తిదాయకం అవుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *