అమెరికాలో హైదరాబాది దంపతుల మృతి, భార్యను చంపిన భర్త ఆత్మహత్య

భారత సంతతి దంపతులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

టెక్సాస్ లోని ఘగర్ ల్యాండ్ ప్రాంతంలో వీరు నివాసం ఉంటున్నారు.

హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ నకిరేకంటి(51) తొలుత తన భార్య శాంతి నకిరేకంటి(46) మీ తుపాకితో కాల్చి చంపి ఆ తర్వాత దానితోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

శ్రీనివాస్ భార్య శాంతి వారి ఇంటి గేటు నుంచి లోపలికి వెళ్లే మార్గం మధ్యలో తలకి గాయం తో మృతి చెందినట్లు తెలిపారు.

శ్రీనివాస్ చాతీలో తుపాకీ గుండు తగిలిన గాయం తో అతడి పడకగదిలోనే మరణించినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

టెక్సాస్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో వీరు నివాసంలో తుపాకి కాల్పులు వినిపించండి ఇరుగుపొరుగు నుంచి పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. డోర్ బెల్ మోగించ గానేశ్రీనివాస్ కుమార్తె వచ్చి తలుపు తీశారు అని పోలీసులు చెప్పారు

ఘటన జరిగిన సమయంలో ఆమె నిద్రలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

శ్రీనివాస్ దంపతులకు టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఓ కుమారుడు (21) కూడా ఉన్నట్టు వారి కుటుంబ సన్నిహితులు చెప్పారు.

శ్రీనివాస్, శాంతి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండే వారని వారి కుటుంబంలో కలహాలు లేవని కూడా చిరకాలంగా వారి స్నేహితుడు గా ఉన్న వారు తెలిపారు.

వాళ్ళిద్దరూ కూడా స్థానికంగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు అన్నారు.

ఈ విషాద ఘటన అనంతరం శ్రీనివాస్ కుమార్తె అయిన స్నేహితుల సంరక్షణ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

హ్యూస్టన్ లో ని ఓ ఇంధన సంస్థ లో శ్రీనివాస్ డైరెక్టర్ హోదాలో పని చేస్తుండగా ఆయన భార్య శాంతి కంప్యూటర్ ప్రోగ్రామర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీనివాస్ శాంతి ఇద్దరూ ఇంజనీర్లే హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీ నివాస్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.

టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు శాంతితో శ్రీనివాసుకు పరిచయమయ్యింది.

ఇద్దరు పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు, శ్రీనివాస్ 2005లో టెక్సాస్ లో ఆర్ ఆర్ ఐ ఎనర్జీ లో సంచాలకుడిగా పనిచేశారు.

అనంతరం జేన్ఆన్ ఎనర్జీ, ఏన్ఆర్ జీ ఎనర్జీ నెక్స్ట్, ఏరా ఎనర్జీ ,వంటి సంస్థలు 13 ఏళ్లు వివిధ హోదాల్లో పని చేశారు. శ్రీనివాస్ ప్రస్తుతం ఒక బహుళజాతి సంస్థ కన్సల్టెంట్ గా సేవలందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *