ఫలితాలు వెల్లడించే తేదీలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు

డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15న ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

పదోతరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 27న వెల్లడిస్తామని వివరించారు. వీటితో పాటు పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలు, వాటి ఫలితాలు వెల్లడించే తేదీలను మంత్రి ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.

మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని మంత్రి తెలిపారు. పరీక్షలకు మొత్తం 6,21,623 మంది విద్యార్థులు హాజరవుతారని, 2,838 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
ఏప్రిల్‌ 27న పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంటర్‌ పరీక్షలకు 10,17,600 మంది విద్యార్థులు హాజరవుతారని, మొత్తం 1430 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఏప్రిల్‌ 12న ఇంటర్‌ ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

ప్రవేశ పరీక్షల తేదీలు..

* ఏప్రిల్‌ 19న ఏపీ ఈసెట్‌.. మే 30న ఫలితాలు

* ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్‌ పరీక్షలు.. మే 1న ఫలితాలు

* ఏప్రిల్‌ 26న ఐసెట్‌.. మే 3న ఫలితాలు వెల్లడి

* మే 1 నుంచి 4 వరకు ఏపీ పీజీసెట్‌ పరీక్షలు.. మే 11న ఫలితాలు

* మే 6న ఏపీ ఈడీసెట్‌.. మే 10న ఫలితాలు

* మే 6న ఏపీ లాసెట్‌ పరీక్షలు.. మే 13న ఫలితాలు

* మే 6 నుంచి 15 వరకు ఏపీ పీఈసెట్‌.. మే 25న ఫలితాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *