డేటా స్కాం దొంగ చంద్రబాబు నిజరూపం బట్టబయలు

దొంగతనం చేసిన వ్యక్తిని దొంగ అంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో దొంగతనం చేస్తున్న వ్యక్తిని మాత్రం సీఎం అనాల్సి వస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్సీ పార్టీ అధినేత వైఎస్ జగన్.

నెల్లూరులో జరిగిన సమర శంఖారావం సభలో ప్రసంగించిన జగన్, డేటా స్కామ్ కు సంబంధించి చంద్రబాబు నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. 

“బాబు పరిస్థితి ఎలా ఉందంటే.. దొంగ ఓట్లు తానే చేరుస్తాడు, ఓట్లు వేయని ఓట్లను తానే తీయిస్తాడు. దొంగ పనులు చేసి తనే దొంగ..దొంగ అని అరుస్తాడు.

ఇది ఏ స్థాయిలో జరుగుతుందంటే స్వయంగా మా సొంత చిన్నాన్న ఓటును తీసేయడానికి ప్రయత్నించారు.

బాబుకు ఎల్లో మీడియా మద్దతుందని, ఏమైనా చెల్లుబాటు అవుతుందని ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు.”

డూప్లికేట్ ఓట్లను తొలిగించమని స్వయంగా వైసీపీ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, అదే వైసీపీపై చంద్రబాబు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు జగన్.

డేటా స్కామ్ లో దొంగతనం చేస్తూ అడ్డంగా పట్టుబడిన బాబు, కనీసం ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పలేదన్నారు. 

డేటా స్కామ్ లో దొంగతనం చేస్తూ అడ్డంగా పట్టుబడిన బాబు, కనీసం ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పలేదన్నారు. 

“ఏపీలో చంద్రబాబు వ్యవస్థల్ని భ్రష్టుపట్టిస్తున్నారు. మొత్తం 59లక్షల 16వేల దొంగ ఓట్లు ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 20 లక్షల దొంగ ఓట్లు ఉంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి.

డూప్లికేట్ ఓట్లు తొలిగించమని ఎన్నికల కమిషన్ కు మనమే ఫిర్యాదు చేశాం. చంద్రబాబు మాత్రం మనం వ్యవస్థను నాశనం చేస్తున్నామని అంటున్నారు.”

డేటా స్కామ్ గురించి ప్రశ్నిస్తే సెల్ ఫోన్ తనే కనిబెట్టానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు జగన్.

స్కామ్ లో పేర్లు చెప్పమంటే సైబరాబాద్ తనే నిర్మించానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. 

“ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన కలర్ ఫొటోల ఓటర్ల జాబితా లిస్ట్ చంద్రబాబు బినామీ కంపెనీలకు చేరిపోయాయి.

ప్రజల ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఎకౌంట్ నంబర్లన్నీ ఆ బినామీ కంపెనీల వద్ద ఉన్నాయి.

మామూలుగా ఇలాంటి పనులు చేస్తే అతడ్ని దొంగ అంటారు. కానీ మన ఖర్మ ఏంటంటే.. ఈరోజు ఈ మనిషిని ముఖ్యమంత్రి అంటున్నాం. ఈయన కొడుకును ఐటీ మంత్రి అంటున్నాం.” 

అత్యంత కీలకమైన డేటాను బినామీ కంపెనీలకు ఎందుకు ఇచ్చారని బాబును సూటిగా ప్రశ్నించారు జగన్.

టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్ పేరు చెప్పి, డేటాను వక్రమార్గంలో వాడుతున్నారని ఆరోపించిన జగన్.

దొంగ ఓట్లను అలానే కొనసాగించాలనే దిక్కుమాలిన ఆలోచనతో ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

పోలీసుల్ని ఇంటి వాచ్ మేన్ కంటే హీనంగా వాడుకుంటున్న చంద్రబాబు.. తక్షణం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *