మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్‌.. 50వేలమందికి ఉద్యోగాలు!

మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్. ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాదాపు 50వేల మందికిపైగా నియామక పత్రాలు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో హామీ నెరవేర్చుకున్నారు. శుక్రవారం ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌)కు శ్రీకారం చుట్టారు.

సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆప్కాస్‌ను జగన్‌ ప్రారంభించారు.

ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాదాపు 50వేల మందికిపైగా నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు పొందిన పలువురితో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు.

పాదయాత్ర సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలను చూశానని.. జీతాల విషయంలో గతంలో కోతలు విధించారని గుర్తు చేశారు సీఎం.

అంతేకాదు గతంలో ఉద్యోగాలు రావాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని.. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేయాలనే ఉద్దేశంతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు.

అంతేకాదు మహిళలకూ 50 శాతం ఉద్యోగాలు దక్కాయన్నారు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా పారదర్శకత ఉండేలా చూస్తున్నామన్నారు.

ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతామన్నారు.

ఉద్యోగాల విషయంలో సిఫార్సులు, దళారీలకు చోటు లేదన్నారు జగన్. కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *