ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును బహిష్కరించండి అంటూ జన జాగరణ సమితి

విశాఖపట్నం : ఫిబ్రవరి 14న వాలెంటేన్ డేగా జరుపుకోవడం మన సంస్కృతి సంప్రదాయం కాదని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ కె. వాసు అన్నారు.
మంగళవారం వీజేఎఫ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయలు ఈ ప్రేమికుల రోజు జరుపుకోవడం మన సంస్కృతి కాదన్నారు.
ప్రేమికుల రోజున బహిష్కరించమని ప్రబోధిస్తూ గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన యువతీ యువకులకు తల్లిదండ్రుల యొక్క ఆవేదనను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క నడవడికి ఉండాలి అని పేర్కొన్నారు.
ప్రేమ అంటే అర్థం తెలియని వయసులో ప్రేమికులరోజు గొప్పగా జరుపుకోవడం అనేది గొప్ప కాదన్నారు. తెలిసీ తెలియని వయసులో చేసే తప్పులు భవిష్యత్తులో చాలా బాధ పడతాయి. భవిష్యత్తును అంధకారంలోకి తోస్తుందని చెప్పారు.
ప్రేమికుల రోజు పేరుతో యువతీ యువకులు విచ్చలవిడి లైంగిక విశృం కలత్వానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి వేడుకల ద్వారా సమాజంలో విలువలు పతనం అవుతున్నాయని, యువతను మాదక ద్రవ్యాలకు బానిసలను చేసి వేలకోట్ల రూపాయలు విదేశీయులు ఆర్జిస్తున్నారని విమర్శించారు.
ఇటువంటి మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల యువతలోని నైపుణ్యం , మేధస్సు బుగ్గిపాలు అవుతోందని ఆవేదన చెందారు.
ఇటువంటి వేడుకలు చిన్నారుల్లో విషపు బీజాలు నాటుతున్న కారణంగా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారన్నారు.
ఇటువంటి ఉపద్రవాలను అధిగమించడానికి జన జాగరణ సమితి గోడపత్రికలు , కరపత్రాలు, చైతన్య సదస్సుల ద్వారా యువతను జాగృతం చేస్తుందన్నారు.
ప్రేమికులరోజైన ఫిబ్రవరి14ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిరుపతి, విజయవాడ , విశాఖ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మహాత్మాఫౌండేషన్ వ్యవస్ధాపకులు దానేష్ , జనజాగరణసమితి నగర ఇంఛార్ సునీల్ కుమార్ , పరివార్ ఇన్ఫ్రాఛైర్మన్ వంశీ యాదవ్ ,
అనుదీప్ , కృష్ట తదితరులు పాల్గొన్నారు..