నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 20 అంశాలపై మంత్రివర్గం గుడ్‌న్యూస్ చెబుతారా!

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. గుడ్‌న్యూస్ చెబుతారా!
ఈ మంత్రివర్గ సమావేశంలో పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా నియంత్రణా చర్యలు, కీలక అంశాలపై చర్చించనున్నారు.
మొత్తం 20 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.
నేడు ఏపీ కేబినెట్ సమావేశంకానుంది. వెలగపూడి సచివాలయం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీకానుంది.
ఈ సమావేశంలో పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా నియంత్రణా చర్యలు, కీలక అంశాలపై చర్చించనున్నారు.
మొత్తం 20 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది..
దీనిపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గుడ్‌న్యూస్ చెబుతారనే చర్చ జరుగుతోంది.
కేబినెట్ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే స్పనెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
ఇసుక సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోందట. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. మిగిలిన సంక్షేమ పథకాలతో పాటూ పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.