చల్లారిన ‘మహా’ కల్లోలం

మొత్తానికి బయోపిక్ డిస్ట్రిబ్యూషన్ తుపాను తీరందాటింది. బయోపిక్ పార్ట్ 2 ఓవర్ సీస్ హక్కులు పార్ట్ వన్ పంపిణీ చేసిన యుఎస్ తెలుగు సంస్థకే ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు బోగట్టా.

నిన్నటి నుంచి ఈ ఇష్యూ నలుగుతోంది. రెండోపార్ట్ కు గాను మూడుకోట్లు కట్టమని ఎన్బీకే ఫిలింస్ యూనిట్, అంత కట్టలేమని ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ బిగుసుకుపోయి కూర్చోవడంతో ముడి బిగిసింది.

ముందు అస్సలు డబ్బులు కట్టలేమని, పార్ట్ వన్ లో ఆరుకోట్లు పోయాయని బయ్యర్లు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. కానీ యూనిట్ బాధ్యులు వినలేదు.

రెండుకోట్లు ఇచ్చి, కోటికి చెక్ ఇవ్వమని, సినిమా హిట్ అయితే ఆ చెక్ హానర్ చేయాలని చెపుతూ వచ్చారు.

ఆఖరికి ఈరోజు కోటిన్నర ఇచ్చేందుకు, సినిమా బ్లాక్ బస్టర్ అయితే కోటి ఇచ్చేందుకు, అందుకు వీలుగా ఇప్పుడే చెక్ ఇవ్వడానికి నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే మరో బయ్యర్ సాయి కొర్రపాటికి కృష్ణ, వైజాగ్ జిల్లాలు ఇవ్వడానికి కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

నిన్నటి వరకు ఈ జిల్లాలను సురేష్ సంస్థ ద్వారా పంపిణీ చేయించాలని అనుకున్నారు. దీనిపై బాలయ్యకు కొంతమంది ఇది అంతగా బాగుండదని,

సాయి కొర్రపాటి సినిమాకు సహ నిర్మాత, పార్ట్ వన్ లో తీవ్రంగా నష్టపోయారని, అత్యంత విధేయుడని ఒకటికి పదిసార్లు విన్నవించడంతో, ఆయనే ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మొత్తంమీద ఆ విధంగా బయోపిక్ ఈనెల 22న విడుదలకు అన్నివిధాలా మార్గం సుగమం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *