వైస్సార్ సీపీ చెంతనే BC లు అంతా

ఓటర్లను సామాజిక వర్గాలుగా విభజిస్తే.. అందులో సింహభాగం బీసీలది. కులాల వారీగా విడగొట్టకుండా కేవలం వెనుకబడిన తరగతులుగా పరిగణిస్తే 46శాతం ఓట్లు బీసీలకే ఉంటాయి. అందుకే బీసీ వర్గాలకు గాలం వేయాలని రాజకీయ పార్టీలన్నీ చూస్తుంటాయి.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అప్పటివరకూ కాంగ్రెస్ తో ఉన్న వృత్తి వర్గాలు ఎన్టీఆర్ కి అండగా నిలిచాయి.

తెలుగుదేశం స్థాపించింది, అందులో కీలకపాత్ర పోషించేది ఒకే సామాజిక వర్గం అయినా, టీడీపీకి బీసీల పార్టీగా ముద్రపడింది.

కానీ ఇప్పుడా బీసీలే బాబుని దూరం పెడుతున్నారు. ఇదంతా ఒక్కరోజులోనో, ఒక్క ఏడాదిలోనో జరిగింది కాదు.

బాబు అవినీతి పుట్ట పెరిగి పెద్దదై బీసీలను పార్టీకి దూరంచేసింది. 2014 ఎన్నికల్లో సగానికిపైగా బీసీ వర్గాలు టీడీపీ వెంటే ఉన్నాయి.

ఈ దఫా సీన్ పూర్తిగా మారిపోయింది. బీసీలంతా జగన్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఏలూరులో జరిగిన బీసీగర్జన సభ విజయమే దీనికి నిదర్శనం.

దీనివెనక జగన్ విజన్ ఎంత ఉందో, బాబు స్వయంకృతాపరాదం కూడా అంతే ఉంది.

పార్టీలో బీసీలకు ప్రాధాన్యత తగ్గడంతోటే చంద్రబాబుపై ఆయావర్గాల్లో నమ్మకం పోయింది.

కాపు రిజర్వేషన్లంటూ బీసీ కోటాలో కోత కోసేందుకు సిద్ధమైనప్పుడు చంద్రబాబు పతనం ఖరారైంది.

బీసీ వర్గాలన్నీ చంద్రబాబు రిజర్’వేషాల’కు వ్యతిరేకంగా గళమెత్తాయి. అయినా బాబు మారలేదు.

కార్పొరేషన్ల ఏర్పాటులో అందరికంటే చివరిగా బీసీలవైపు చూశారు చంద్రబాబు. ప్రభుత్వం దిగిపోయేటప్పుడు హడావిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నిధుల విషయంలో చేతులెత్తేశారు.

ప్రతిఏటా 10వేల కోట్లిస్తామని ప్రకటించి ఐదేళ్లలో 50వేల కోట్లకుగాను 18వేల కోట్లు మాత్రమే విదిల్చారు చంద్రబాబు. దీంతో పాటు గత ఎన్నికల టైమ్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బీసీ వర్గాల చెంతకు చేర్చలేదు.

ఇలా చెప్పుకుంటూపోతే బీసీలు టీడీపీకి దూరమవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అదే సమయంలో జగన్ పై బీసీల్లో భరోసా పెరిగింది.

ఫీజు రీఎంబర్స్ మెంట్ తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనాడు ప్రతి బీసీ కుటుంబానికి ఎనలేని మేలుచేసింది. ఆ కృతజ్ఞతా భావంతోనే ఈనాడు బీసీలంతా జగన్ వెంట నడవడానికి సిద్ధమయ్యారు.

జగన్ చేసిన బీసీ డిక్లరేషన్ కి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *