కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ ఆడియో టేపులు కలకలం

కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ ఆడియో టేపులు కలకలం రేగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తమ ఎమ్మెల్యేలకు బిజెపి నేతలకు డబ్బును ఎర గా వాడినట్లుగా ఆడియో టేపును విడుదల చేశారు.
అందులో… ఒక్క ఎమ్మెల్యే కు 500 కోట్ల రూపాయలు నగదు, మంత్రి పదవి బిజెపి నేతలు కు ఆఫర్ చేస్తున్నట్లు గా ఉంది.
బీజేపీ నేత యడ్యూరప్ప కుమారుడు.. ఈ బేరసారాల్లో ముఖ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం కొనసాగుతోంది.

కొద్దిరోజులుగా కర్ణాటక భారతీయ జనతా పార్టీ నేతలు ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో నలుగురు ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకున్నారు.
వారు ఇప్పుడు సీఎల్పీ సమావేశాలకు, అసెంబ్లీ కి హాజరు కావడం లేదు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ప్రయత్నంలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది.
అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కన్నా లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ అధికారంలో ఉండకూడదన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఉంది.
దీనికోసమే అమిత్ షా నేతృత్వంలోని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ఎమ్మెల్యేలు అందరు ఢిల్లీకి వెళ్లారు. ఆ తరువాత క్యాంపుకు కొనసాగారు.
అదే సమయంలో కాంగ్రెస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం అయ్యారు.
భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలో గత ఎన్నికల్లో 17 పార్లమెంటు సీట్లు వచ్చాయి. ఈ సారి కాంగ్రెస్ జెడిఎస్ కలిసి పోటీ చేస్తే మెజారిటీ 12 స్వీట్లు గల్లంతవుతాయి. దక్షిణాదిలో పెంచుకోవాలను కుంటోంది.
కానీ దక్షిణాదిలో ఆ పార్టీకి బలం ఉన్న కర్ణాటకలో మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఒక్క సీట్ అయినా వస్తుందని నమ్మకం లేదు.
అందుకే కర్ణాటకలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని ఆశతో బిజెపి ఉంది.
ఈ లక్ష్యం సాధించాలంటే కాంగ్రెస్- జెడిఎస్ కలిసి పోటీ చేయకూడదు. అందుకే ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.