తప్పుడు సర్వే చేసి అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజలు లగడపాటిపై దుమ్మెత్తిపోశారు….

తప్పుడు సర్వే.. లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు
ఫలితాల తర్వాత లగపాడి రాజగోపాల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తప్పుడు సర్వే చేసి అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజలు దుమ్మెత్తిపోశారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మూడు రోజుల ముందు అంటే మే 19న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఏపీలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వమే రాబోతోంది అంటూ తన సర్వే వివరాలను మీడియా సమక్షంలో రాజగోపాల్ వెల్లడించారు. టీడీపీకి 90 నుంచి 100 సీట్లు వస్తాయని ప్రకటించారు. కానీ, లగడపాటి సర్వే తారుమారు అయిపోయింది.
అసలు ఆ సర్వే శుద్ధ తప్పని ఫలితాలు వెలువడినాక అర్థమైంది. ఏకంగా 151 స్థానాలను కైవసం చేసుకుని వైసీపీ ప్రభంజనం సృష్టించింది.
తప్పుడు సర్వే చేసి అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజలు దుమ్మెత్తిపోశారు.
ఫలితాల తర్వాత లగపాడి రాజగోపాల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
ఈ దెబ్బతో ఇకపై తాను ఎన్నికల ఫలితాలపై సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చేయనని లగడపాటి ప్రకటించారు.
ప్రజలను క్షమించమని కోరారు. అయినప్పటికీ ఆయన్ని వదలడంలేదు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తప్పుడు సర్వే ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొవ్వూరుకు చెందిన సీనియర్ న్యాయవాది పిల్లలమర్రి మురళీకృష్ణ పట్టణ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మీడియాలో పదే పదే విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను బెట్టింగ్‌కు పురిగొల్పేలా మోసపూరిత సర్వే ప్రకటించారని ఆరోపించారు.
ఈ సర్వేను నమ్మి ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వెనుక అంతర్జాతీయ మాఫియా ఉందన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
స్వచ్ఛంద సంస్థలు, విశ్లేషకులు, పోలీసులు, మానవతావాదులు, మానవ హక్కుల సంఘాలు బెట్టింగ్ నిర్మూలనకు సహకరించాలని కోరారు.