ఐదు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై…. స్పష్టతకు వచ్చిన టీడీపీ

టీడీపీ దూకుడు.. ఆ ఐదుగురు అభ్యర్థులు ఫైనల్..చంద్రబాబు

రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ. ఐదు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై దాదాపు స్పష్టతకు వచ్చిన టీడీపీ అధినేత.


గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు నియోజకవర్గాలవారీగా బలాబలాలపై చర్చఇబ్బందులు లేనిచోట్ల అభ్యర్థులు ఫైనల్

ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది టీడీపీ. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసిన దూకుడు పెంచిన చంద్రబాబు.. ఇక గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టారు. జిల్లాలు, నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. గురువారం రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల బలాబలాను బేరీజు వేశారు. నేతల అభిప్రాయాలను సేకరించిన టీడీపీ అధినేత.. ఐదు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.

రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. అభ్యర్థుల విషయానికొస్తే..
చిత్తూరు జిల్లాలో.. పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు).. పుంగనూరు – అనూషా రెడ్డి (మంత్రి అమర్నాథ్ రెడ్డి బంధువు)లు బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

మదనపల్లె, తంబళ్లపల్లి నియోజకవర్గాల అభ్యర్థిల ఎంపికపై కసరత్తు కొనసాగుతోందట.ఇక కడప జిల్లాలో అభ్యర్థుల విషయానికొస్తే ..
రాజంపేట – చెంగల్రాయుడు (మాజీ ఎమ్మెల్సీ)
రాయచోటి – రమేష్‌కుమార్ రెడ్డి (టీడీపీ నేత)

రైల్వే కోడూరు – నరసింహ ప్రసాద్ (చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు)లు ఉన్నారట. ఈ ఆరుగురు అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

టికెట్ల విషయంలో అసంతృప్తికి గురైన నేతలకు సీఎం నచ్చజెప్పారట. రాబోయే రోజుల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *