లోకేష్ తో కామెడీ చేస్తున్న టిడిపి నేతలు…

టిడిపి అధినేత తనయుడు నారా లోకేష్, అంటే పార్టీ నేతలకే కామెడీ అయి పోయినట్లుగా ఉంది.

వచ్చే ఎన్నికల విషయంలో లోకేష్ పై ఓపెన్ కామెంట్రీ కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో కొత్త తల నొప్పి మొదలైంది లోకేష్ కు.

రేపటి ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడం కరెక్ట్ అంటూ ప్రకటన కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ ప్రకటనలు లోకేష్ మీద ఒత్తిడిని పెంచుతున్నాయి.

సోమిరెడ్డి, రామసుబ్బా రెడ్డి లాంటి నేతలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నారు… లోకేష్ మాత్రం ఎమ్మెల్సీ పదవిని అలాగే అంటిపెట్టుకుని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి.

ఈ విషయంలో లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా లేదా అనే చర్చలు కొనసాగుతున్నాయి.

మరోవైపు తన సీటు నుంచి లోకేష్ పోటీ చేయాలని ఓపెన్ ఆఫర్లు కూడా ఇచ్చే నేతలు ఉన్నారు. ఈ విషయంలో టిడిపి నేతలు లోకేష్ పోటీ పై కామెడీ కూడా చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమర్నాథరెడ్డి తన సీటు నుంచి పోటీ చేయాలని అన్నారు లోకేష్ ని.

అమర్నాథ్ రెడ్డి తన స్థానం నుంచి పోటీ చేసే ఆసక్తి లేక, అలా లోకేష్ ను ఇరికించే ప్రయత్నం చేశారు..

ఇప్పుడు కర్నూలు ఎమ్మెల్యే, ఫిరాయింపు నేత ఎస్వి మోహన రెడ్డి కూడా ఇదే త్యాగానికి సిద్ధమవుతున్నారు.

కర్నూల్ నుంచి లోకేష్ పోటీ చేయాలని, మరోచోట కూడా టికెట్ అడిగేది ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఎలాగో జగన్ ఆ సీటు జోలికి రారు అని తెలుసు.. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారేమో… లోకేష్ పోటీ కి ఏ నియోజకవర్గం లేదని దేప్పి పొడుస్తున్నట్లుగా కనిపిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *