గోరింత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకోవడం టీడీపీ కి బాగా అలవాటయిపోయింది

పెంచిన పెన్షన్ల పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ‘పసుపు’ రంగుని రాష్ట్రానికి పూసే ప్రయత్నం అధికార తెలుగుదేశం పార్టీ చేస్తోంది.

పెన్షన్ల వ్యవహారమొక్కటే కాదు, డ్వాక్రా మహిళలకు ‘పసువు – కుంకుమ’ పేరుతోనూ నానా హంగామా చేస్తున్న.

తెలుగుదేశం పార్టీ నేతలకు ఎక్కడికక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పెన్షన్ల ఎపిసోడ్ కి పెద్దగా వ్యతిరేకత రాకపోయినా , డ్వాక్రా మహిళలు మాత్రం అధికారం తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరు

Image result for pasupu kumkuma scheme details

గుతున్నారు.

మంత్రులను సైతం ప్రజల నిలదీయడంతో బిక్కచచ్చి పోవాల్సి వస్తుంది. సాక్షాత్తూ మహిళా మంత్రి పరిటాల సునీత కి సొంత జిల్లాల్లో మహిళలు చుక్కలు చూపించేశారు.

మహిళా మంత్రులు పరిస్థితే ఇలా వుంటే, పురుష పుంగవులైన మంత్రులు మాట ఏమిటి?

మహిళల శాపనార్థాలు దెబ్బకి అధికార పార్టీ నేతలు పరుగులు పెట్టవలసి వస్తోంది. ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు ముందర చంద్రబాబు, ‘దింపుడు కళ్ళెం ఆశ ‘ అన్నట్టుగా, కుప్పలుతెప్పలుగా తాయిలాల ప్రకటించేస్తున్నారు.

అందులో పెన్షన్ల పెంపు ఒకటి. మామూలుగా అయితే పెన్షన్ డబుల్ అయినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేయాలి. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు.

డ్వాక్రా మహిళలు సైతం, పసుపు – కుంకుమ పథకం పట్ల పండుగ చేసుకోవాల్సింది పోయి, ‘అధికారం పోతుందని తెలుసు ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్లు చేస్తారా.? అంటూ నిలదీస్తున్నారు.

మొత్తంగా ఇప్పటి దాకా జరిగిన ఈ తతంగం పై చంద్రబాబు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో గా ఆ , రిపోర్ట్ చూశాక ఆయన గారికి మైండ్ బ్లాక్ అయిపోయిందట.

ప్రజల్లో ఎంత వ్యతిరేకత వుందో చంద్రబాబుకి తెలియనిదేమి కాదు.

అందుకే రాత్రికి రాత్రి కొత్త కొత్త పథకాలు ఆయన నుంచి వచ్చి పడిపోతున్నాయి. ఇవన్నీ ఓట్లను ఆకర్షించేందుకే ఈ సర్వేలో అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు కన్పించకపోవడంతో, ఓటమి తప్పదన్న భావన కు చంద్రబాబు వచ్చేశారు.

వ్యతిరేకతను తగ్గించుకోవాల్సిందే… అంటూ ప్రజలకు తాయిలాల ప్రకటిస్తున్నారుగానీ , ఈ తాయిలాల తో పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగు పడ్డంలేదు సరికదా , జనంలోకి వెళ్ళిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న చేదు అనుభవాలతో పార్టీ పరిస్థితి మరింత దిగజారి పోతోందన్నది నిర్వివాదాంశం.

నాలుగున్నరేళ్ళు మభ్యపెట్టినందుకు , జనం ఎదురు తిరగకుండా వుంటారా? పథకాలు లబ్ది దారులే ఇలా ఎదురు తిరుగుతోంటే, చంద్రబాబు పరిస్థితి రానున్న ఎన్నికల్లో ఎలా వుండబోతుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

మరి రెండు ఎంపీ సీట్లతో టిడిపి సరిపెట్టుకోవాల్సి రావడమేంటి.? అని కొందరు అనుమానం వ్యక్తం చేసి, అధికార పార్టీ పై జాలి చూపారుగానీ..పసువు పండగ చూశాక, ఆ రెండు కూడా ఎక్కువేనన్న భావనకు ఎవరైనా రావాల్సిందేనేమో.

అయితే కులమత పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇవ్వాల్సిన పింఛన్ పంపీణీలోనూ చింతమనేని వంటి ఎమ్మెలే టీడీపీ వారు ఇస్తున్న ఫించన్లు తీసుకోవడానికి వైకాపా అభిమానులకు సిగ్గు లేదా? అనడం మంత్రి అచ్చెన్న మరో అడుగు ముందుకేసి మా డబ్బులు దొబ్బి జగన్ కి ఓటు ఎలా వేస్తారనడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *