వివేకా హత్య కేసులో నా పాత్ర ఉందని తేలితే ఉరి తీయండి: మంత్రి ఆది

నాకు భార్య, పిల్లలు ఉన్నారని.. నిరాధారమైన ఆరోపణలు చేయడం బాధించాయి. వివేకా హత్యకేసులో కొందరు తమ బండారం బయటపడుతుందని భయపడతున్నారన్నారన్న ఆదినారాయణరెడ్డి.
1.ఎన్నికల లోపు దోషులు ఎవరో తేలితే ఓట్లు రావనే భయం.
2.తప్పు చేసిన వారి పేర్లు బయటపడతాయనే భయం.
3.ముందు గుండెపోటని.. తర్వాత హత్యని ఎందుకు చెప్పారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తన పాత్ర ఉందని తేలితే ఉరికి సిద్ధమంటున్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి.
తనకు భార్య, పిల్లలు ఉన్నారని.. నిరాధారమైన ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.
వివేకా హత్యపై సిట్ లేకుండా.. కేసుకు సంబంధించిన రిపోర్ట్‌ను బయటపెట్టొద్దని చెప్పారంటే అర్థమేంటన్నారు.

ఈ కేసులో తనతో పాటూ సతీష్‌రెడ్డి, బీటెక్ రవి పేర్లను తీసుకువస్తున్నారని.. తమపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
వివేకా హత్యకేసులో కొందరు తమ బండారం బయటపడుతుందని భయపడుతున్నారన్నారు ఆదినారాయణరెడ్డి. అందుకే ఐపీఎస్‌లను బదిలీ చేయిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల లోపు దోషులు ఎవరో తేలితే ఓట్లు రావనే భయంతో విచారణ వద్దు.. మీడియాకు వివరాలు బయపెట్టొద్దు.. వాయిదా వేయాలని కోరుతున్నారని విమర్శించారు. దీనిని బట్టే తప్పు చేసిన వారి పేర్లు బయటపడతాయనే భయం మొదలయ్యిందన్నారు.
ఈ హత్యకేసులో తన ప్రమేయం ఉంటే.. ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. లేని పక్షంలో తనపై ఆరోపణలు చేసినవారు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ చేశారు.
వివేకానందరెడ్డి చనిపోయిన పది గంటల తర్వాత జగన్ వచ్చారని.. ఎందుకు ఆలస్యంగా వచ్చారో చెప్పాలన్నారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని ముందు చెప్పారని.. తర్వాత హత్య అని మాట మార్చారనన్నారు. తర్వాత చంద్రబాబు, లోకేష్, సతీష్‌రెడ్డిలపై ఆరోపణలు చేశారన్నారు. ముందు మార్ఫింగ్.. తర్వాత డూపింగ్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.