సన్నీ లియోన్.. జూనియర్ ఇంజనీర్ పరీక్షలో టాప్ ర్యాంక్

బిహార్ ప్రజా వైద్య శాఖ నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ పరీక్షలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ టాపర్‌గా నిలిచింది. దీనికి సంబంధించి సన్నీ ఓ ఫన్నీ ట్వీట్ చేసింది.

  • 1.అందం, అభినయమే కాదు.. తెలివి తేటల్లోనూ తాను తక్కువేం కాదంటోంది సన్నీ లియోన్.
  • 2.బిహార్‌లో జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షలో టాప్ ర్యాంక్!
  • 3.ఫన్నీ ట్వీట్‌తో విషయం చెప్పిన సన్నీ..
  • అసలు విషయం తెలిస్తే షాకవుతారు..

సన్నీ లియోన్.. పరిచయం అక్కర్లేని పేరిది. అందంతో పాటు అభినయంతోనూ లెక్కకు మిక్కిలి అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్‌కు చెందిన ఈ భామ. తాజాగా ఎవరూ ఊహించనివిధంగా వార్తల్లోకెక్కింది.

బిహార్‌ ప్రభుత్వం నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ పరీక్షలో టాపర్‌గా నిలిచింది. సన్నీ లియోన్ ఏంటీ.. ఇంజనీర్ ఎగ్జామ్‌లో టాప్ ర్యాంక్ సాధించడమేంటీ అనుకుంటున్నారా? బిహార్ అధికారులు కూడా ఇలాగే ఆశ్చర్యపోయారు. సన్నీ కూడా షాక్‌కు గురవడం కొసమెరుపు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బిహార్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఓ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాల్లో టాపర్ స్థానంలో సన్నీ లియోన్‌ పేరు సూచిస్తోంది.

సన్నీ తండ్రి పేరును లియోనా లియోన్‌గా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అంతేకాదు సన్నీ వయసును 27 ఏళ్లుగా చెబుతోంది. పరీక్షలో సన్నీ లియోన్ 98.50 శాతం మార్కులు, 73.50 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో నిలవడం గమనార్హం.

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మాత్రం ఎలాంటి ఇంజనీర్ పరీక్ష రాయలేదన్నది సుస్పష్టం.

అయితే.. సన్నీ పేరుతో ఎవరైనా పరీక్షకు దరఖాస్తు చేసుకొని ఉండాలి, లేదా సాంకేతిక లోపం వల్ల ఫలితాల్లో ఆమె పేరు వచ్చి ఉండాలి.

బిహార్ ఇంజనీర్ పరీక్ష ఫలితాల్లో చోటుచేసుకున్న చోద్యం గురించి సన్నీ.. ఓ ఫన్నీ ట్వీట్ ద్వారా వెల్లడించింది. దీంతో ఈ వార్త వైరల్ అవుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *