మరో కొత్త సినిమా ప్లాన్‌లో పడ్డాడు అల్లు అర్జున్..కొరటాల డైరెక్షన్‌లో

కొరటాల డైరెక్షన్‌లో ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున
మరో కొత్త సినిమా ప్లాన్‌లో పడ్డాడు అల్లు అర్జున్. ఇప్పుటికే పుష్ప సినిమాతో బిజీగా ఉన్న బన్నీ కొరటాల డైరెక్షన్‌లో సినిమా తీయాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అల వైకుంఠపురం సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
అదే జోష్‌తో కొత్త కొత్త సినిమాలకు అతడు ఓకే చెప్తేస్తున్నాడు. ఇప్పటిక సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో క్రేజీ డైరెక్టర్‌తో బన్నీ జత కడుతున్నాడన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా బన్నీ కొరటాల శివతో కలిసి సినిమా తీస్తాడన్న ప్రచారం జరుగుతోంది.
పుష్ప సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో మంచి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.
అంతేకాదు సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు కూడా సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం కొరటాల చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నాడు.
కొరటాల సినిమా చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్టు చర్చ నడుస్తోంది.
మరి ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవమో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేస్తే స్పష్టత వస్తుంది.
మరోవైపు బన్నీ కూడా పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో పుష్ప షూటింగ్‌కు కూడా బ్రేకులు పడ్డాయి.
దీంతో అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా అప్ డేట్ కోసం ఇంకాస్త సమయం వెయిట్ చేయాల్సిందే.