ఎన్టీఆర్ కు భారతరత్న నాటకాలు ఆడుతూ ఎన్టీఆర్ కి భారతరత్న రాకుండా ఆపింది బాబు గారె: తమ్మారెడ్డి

దయచేసి మీరందరూ నాటకాలు ఆడకండి. ఆయన పేరుమీదే ఈ రోజు చాలా మంది బతుకుతున్నారు. అసలు ఎన్టీఆర్ లేకపోయి ఉంటే తెలుగుదేశం ఉండేది కాదు.

ఆయనే లేకపోతే రాష్ట్రాన్ని ఏలే అవకాశమే లేదు. మీరందరూ కలిసి ఆయన్ని బ్రష్టు పట్టించకుండా ఉంటే చాలా మంచిది’… అంటూ ఫైర్ అయినా తమ్మారెడ్డి భరద్వాజ.

ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ కి భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని తమ్మారెడ్డి విమర్శించారు. అడ్డుకోవాల్సిన కారణం ఏమిటని సంచలన విషయాన్ని బయట పెట్టిన తమ్మారెడ్డి నాటకాలు ఆడదు అంటూ వార్నింగ్.

గత 22 ఏళ్లుగా ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని ఆయన అభిమానించే అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు.. ఆ పార్టీ నాయకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేంద్రం ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే విషయంలో నిరాశే మిగిల్చింది.

ఈ విషయంపై దర్శక నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ బాంబు లాంటి వార్తను చెప్పారు. అసలు ఎన్టీఆర్ కి భారత రత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని.

‘నా ఆలోచన’అని యూట్యూబ్ ఛానల్ లో తమ్మరెడ్డి మాట్లాడుతూ…

‘ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పద్మ అవార్డులను ఇచ్చారు. అయితే 22 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాము. ఎన్టీ రామారావు గారు చనిపోయి 22 ఏళ్లు అయ్యింది. ఆయన చనిపోయిన దగ్గర నుండి ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నారు.

కానీ కేంద్రం ఎందుకు ఈ విషయం గురించి పట్టించుకోవట్లేదు అని అన్నారు. ఇదే విషయంపై చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూసా…’ఎన్టీఆర్ కి భారతరత్న ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నారని తన అసహనాన్ని వ్యక్తంచేశారు.’ అని పేపర్లో చూశా… ఈ విషయంలో చంద్రబాబు పై కామెంట్ చేయాలని కాదు నాకు వచ్చిన అనుమానాన్ని తెలియజేస్తున్నాను.

చంద్రబాబు చాలాసార్లు చెప్పారు… నాకు ప్రధాని పదవి వదులుకున్నానని… మొత్తం భారతదేశాన్ని నేనే నడిపించాను. చక్రం తిప్పాను అంటూ చెప్పుకొచ్చారు. నిజంగా కేంద్రంలో చక్రం తిప్పగల సత్తా బాబుకి ఉండి ఉంటే ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇవ్వలేకపోయారు అని ప్రశ్నించారు.

మొన్నటి వరకు నాలుగున్నరేళ్లు పాటు బిజెపి పార్టీ తో సన్నిహితంగా ఉన్నారు. ఆయన అడిగితే కేంద్రం కాదనేదా? ఇదంతా చూస్తుంటే నాకు ఏదో స్టోరీ లాగ కనిపిస్తుంది.

ప్రకటించేవరకు సైలెంట్ గా ఉంది ప్రకటించిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తే నాకు నిజంగా వచ్చిన అనుమానం ఏమిటంటే ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే… కుటుంబం మొత్తం వెళ్ళాలి.

కాని భార్య గా ఉన్న లక్ష్మీపార్వతి ఆ అవార్డును తీసుకోవాలి. ఎందుకంటే భార్య కాబట్టి.

లక్ష్మీపార్వతి అవార్డును తీసుకోవటం వీళ్ళు ఎవరికీ ఇష్టం లేదు అందుకనే ఎన్టీఆర్ భారతరత్నను ఆపుతున్నారు అనుమానం నాకైతే ఉంది .అయితే మనకు భారతరత్న అక్కర్లేదు అంటే వదిలెయ్యాలి

అంతే తప్ప ఈ స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ప్రతిసారీ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వలేదు… ఇవ్వలేదు… అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ బయోపిక్ వచ్చిన తర్వాత ఆయన గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్లు ఎన్టీఆర్ గురించి చాలా చెడుగా మాట్లాడటం మొదలు పెట్టారు.

ఈ గొడవ కాకుండా మళ్లీ భారతరత్న గొడవ అవసరమా చెప్పండి. అయినా దేశానికి, రాష్ట్రానికి, సినిమా ఇండస్ట్రీకి చాలా చేశారు.భారతదేశం లోనే అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఇంత చరిత్రకారుడు లో మైనస్ లు ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు. 22 సంవత్సరాల తర్వాత ఆయన గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఇలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు.

ఆయన గౌరవం కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని నా ఫీలింగ్. దయచేసి మీరందరూ నాటకాలు ఆడకండి.ఆయన పేరు మీదే ఈరోజు చాలా మంది బతుకుతున్నారు.

అసలు ఎన్టీఆర్ లేకపోతే తెలుగుదేశం లేదు.. ఆయన లేకపోతే ఈరోజు రాష్ట్రాన్ని ఏలే అవకాశమే లేదు. మీరందరూ కలిసి ఆయనను బ్రష్టు పట్టించకుండా ఉంటే చాలా మంచిది అంటూ ఎన్టీఆర్ భారతరత్నపై నాటకాలు ఆడే వాళ్లకు డైరెక్ట్ గానే క్లాస్ పీకారు తమ్మారెడ్డి భరద్వాజ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *