దక్షిణ అమెరికా లో ఎత్తైన పర్వతాల పై తెలుగు తేజాలు

దక్షిణ అమెరికాలోని 6,962 రెండు మీటర్ల ఎత్తైన Akkumm Kaghva పర్వతాలపై తెలుగు తేజాలు, కుంజాదుర్గారావు, మాలా పత్ పూర్ణలు జాతీయ పతాకాన్ని రెపరెపలాడిం చారు.

కుంజా దుర్గారావు ఇప్పటికే ఎవరెస్టు, దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతం అధిరోహించిన ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఈనెల 6న Akkumm Kaghva పర్వతం వద్దకు చేరుకొని నడక ప్రారంభించారు.

14వ తేదీ ఉదయం కల్లా లక్ష్యానికి చేరుకున్నారు. దుర్గారావు ది తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రపురం మండలంలోని మారుమూల గ్రామం కుంజవారి గూడెం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఆయనది.

తెలంగాణ ఎస్ సి గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి కు చెందిన మాలవత్ పూర్ణ మరో అరుదైన ఘనత సాధించారు. నాలుగు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి చిన్న వయసు ఉన్న గిరిజన మహిళగా రికార్డు సృష్టించారు.

శుక్రవారం దక్షిణ అమెరికా ఖండం అర్జెంటీనాకు చెందిన ఆండీస్ పర్వత శ్రేణిలోని అత్యంత ఎత్తైన.
Akkumm Kaghva పర్వతంను అధిరోహించారు. ఈ సందర్భంగా పర్వతంపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *