వారికి రూ.కోటి ఇవ్వాలి.. జగన్ సర్కార్‌కు చంద్రబాబు డిమాండ్

సాల్వెంట్ కంపెనీ బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యం విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. పారిశ్రామిక భద్రతను పెనుప్రమాదంలో పడేశారని.. వరుస ప్రమాదాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు.

విశాఖ రాంకీ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన ప్యాకేజి, రాంకీ సాల్వెంట్ బాధితులకు కూడా ఇవ్వాలన్నారు. టీడీపీ, సీపీఐ, బీజేపీ, జనసేన, కార్మిక సంఘాల నాయకుల నిర్బంధంపై మండిపడ్డారు. సాల్వెంట్ కంపెనీ బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యం విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. పారిశ్రామిక భద్రతను పెనుప్రమాదంలో పడేశారని.. వరుస ప్రమాదాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు.

విశాఖ కంపెనీల్లో విస్ఫోటనాలపై ఎందుకింత నిర్లక్ష్యం..? బాధ్యతారాహిత్యానికి హద్దు అదుపు లేదా..? రాంకీ ఫార్మాసిటీ సాల్వెంట్ పరిశ్రమ పేలుడుకు బాధ్యులపై చర్యలు తీసుకోరా..? రియాక్టర్ వద్ద ఉష్ణోగ్రతలు, వాక్యూమ్ క్రమబద్దీకరణ బాధ్యత కంపెనీది కాదా..? అంటూ ప్రశ్నించారు. తన కొడుకు మంటల్లో ఉన్నాడని గేటు దగ్గర రోదిస్తున్న తల్లి ఆవేదన పట్టదా..? రెవిన్యూ, పోలీసు అధికారులు కంపెనీలో ఉండి ఈ తతంగం అంతా నడిపిస్తారా..? కుటుంబ సభ్యులు తెల్లవార్లూ గేటు వద్ద ధర్నా చేస్తుంటే మృతదేహాన్ని వాళ్లకు చూపించరా..? దొడ్డిదారిన మృతదేహాన్ని ఆసుపత్రికి పంపిస్తారా..? ఇదేం పద్దతి అన్నారు. ప్రమాదానికి కారకులను వదిలేసి పరామర్శకు వెళ్లిన నేతల్ని అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు.

సీఎం జగన్ బాధ్యతారాహిత్యం వల్లే విశాఖలో వరుస ప్రమాదాలు అన్నారు చంద్రబాబు. పాలకుల బాధ్యతారాహిత్యం విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారడం బాధాకరమన్నారు. 68రోజుల్లో 3దుర్ఘటనలు, 15రోజుల్లో ఫార్మాసిటిలోనే 2ప్రమాదాలు జరిగినా మొద్దునిద్ర నుండి మేల్కొనరా అన్నారు. ఎల్జీ పాలిమర్స్ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోరా.. మీరు తప్పులు చేసి టిడిపిపై నిందలు వేస్తారా..? మీ చేతగానితనానికి టిడిపిని నిందించడం హేయం అన్నారు. గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ మృతులు, క్షతగాత్రులకు ఇచ్చిన ప్యాకేజియే సాల్వెంట్ బాధితులకు కూడా అందించి.. రాంకీ సాల్వెంట్ ప్రమాద బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *