చంద్ర బాబు పై కాగ్ రిపోర్ట్, పడగెత్తిన సోషల్ మీడియా

ఈ కాగ్ రిపోర్టు కు జవాబు చెప్పాల్సింది ,మరెవరో కాదు…శ్రీమాన్ శ్రీ శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడుగారు….తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే….

కానీ ఈ బరువును మాత్రం మోయాల్సింది ఆంధ్రులే…. మన భవిష్యత్ ఏమిటనేది , ఆంధ్రులు ఎటువంటి పరిస్థితుల్లో నేడు వున్నారు….అని ఒక్కసారి త్రికరణశుద్దిగా ఆలోచన చేద్దాం

ఆంధ్ర ప్రదేశ్ కాగ్ రిపోర్ట్
Comptroller and Auditor General [CAG]Report

• రుణ మాఫీ పేద రైతులకు చేయలేదు కానీ విత్తనాల పంపిణీ ఏజన్సీలకు ₹12.26 కోట్లు బకాయిలు మాఫీ చేశారు ! – కాగ్

• శనగ విత్తనాల కొనుగోళ్లలో 3 సార్లు కంపెనీలకు ధర పెంచి ₹38.24 కోట్లు దుర్వినియోగం చేశారు – కాగ్

• ముఖ్యమంత్రి సభకు జన సమీకరణ కోసం పాల కేంద్రాల డబ్బు ₹22 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు – కాగ్

• ఆంధ్రప్రదేశ్ రాబోయే 7ఏళ్ళలో ₹76,888 కోట్లు అప్పు తీర్చ వలసి ఉంటుంది -కాగ్

• కేంద్రం ఇచ్చిన జాతీయం గ్రామీణ త్రాగు నీటి పథకం నిధులు ₹ 491 కోట్లు దుర్వినియోగం – కాగ్

• 64 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థల నష్టాల ఊబిలో ₹ 25,367 కోట్లు – కాగ్

• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు వసూళ్ళలో అసమర్ధత వల్ల నష్టం ₹ 607.51 కోట్లు – కాగ్

• .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పై పెట్టిన ₹8,795 కోట్లకు పొందిన వడ్డీ ₹4 కోట్లే ఇది అత్యల్పం – కాగ్

• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది బడి పిల్లల లెక్కింపు పొంతన లేదు – కాగ్

• 10.పట్టిసీమ ప్రాజెక్టులో ప్రతి క్యూబిక్ మీటరు (సుమారు ఓ ట్రాకర్) మట్టి తవ్వడానికి ₹21,350 చెల్లించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – కాగ్

• దివ్యాంగులైన బడి పిల్లల కోసం ఖర్చు చేసినట్లు చూపించిన నిధులకు జరిగిన పనులకు అస్సలు పొంతన లేదు -కాగ్

• మంచినీటి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు 2,400 – కాగ్
• ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 1,014-ప్రైమరీ 37-అప్పర్ ప్రైమరీ. ఖాళీ గా 12,955 టీచర్ పోస్టులు – కాగ్

• 14.ఆంధ్రప్రదేశ్ SC ఫైనాన్స్ కార్పొరేషన్ లబ్దిదారులను గుర్తించే సర్వే కూడా జరపలేదు – కాగ్

• పట్టిసీమ ప్రాజెక్టు జీవిత కాలం 20 ఏళ్ళు -అంధ్రప్రదేశ్ ప్రభుత్వం (అంటే పోలవరం 20 ఏళ్ళు కడతారా ?) -కాగ్

• 16.పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఎగ్రీమెంట్‌లో లేని లేబర్ సెస్ రీయంబర్సు మెంటు రూపంలో ₹14.22 కోట్ల లబ్ది చేశారు – కాగ్

• 17.పట్టిసీమ ప్రాజెక్టు అంచనా ₹1170 కోట్లు కాంట్రాక్టు ఇచ్చింది ₹1427 కోట్లకి చివరికి చెల్లించిన మెత్తం ₹1600 కోట్లు – కాగ్

• 18.మొదటి అంతస్తు స్లాబు వెస్తున్న MLA క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేసినట్టు ₹770 కోట్ల UC (బిల్లు) పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. – కాగ్

• 19.రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్రం ఇచ్చేది ₹1500 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక భవనాలకే ₹684 కోట్లు ఖర్చు చేసింది – కాగ్

• 20.తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణ వ్యేయం ప్రతి చదరపు అడుగుకి (SqFt.) ₹11,000. మార్కెట్ ధరకు ఎన్ని రెట్లు ?? – కాగ్

• 21.2014-16 కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు అధికంగా ఖర్చు చేసిన ₹53,673 కోట్లు క్రమబద్ధీకరించలేదు – కాగ్

• 22.ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 2016-17 ₹530.74 కోట్ల పన్నుల ఎగవేత -కాగ్

• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా, పవర్, మైనింగ్ శాఖలు అసలు లెక్కలే ఇవ్వడం లేదు – కాగ్

• ₹130 కోట్లు స్థానిక సంస్థల డబ్బు వృధా చేస్తూ లెక్కలు చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – కాగ్

• 25.సరైన బిల్లులు లేకుండా వాడకుండా ₹14.33 కోట్లు హెలికాప్టర్ అద్దెలు కట్టినట్లు చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – కాగ్

• 26.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ మొత్తంలో డబ్బు PD (పర్సనల్ డిపాజిట్) ఎకౌంట్లలో ఉంచు కోవడం సరి కాదు – కాగ్

ఆలోచించండి మన ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తోందో

ఇప్పుడు నిజాయితీగా ఆలోచన చేద్దాం.అభివృద్ధి ముసుగులో మన బతుకులను కర్కశంగా కాలరాసి , మన నుదుట మృత్యురాత రాసిన ,రాసేందుకు ప్రయత్నిస్తున్న ,చంద్రబాబు ని ఏమి చెయ్యాలి….మీరే ఆలోచించండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *