డ్వాక్రా సంఘాలకు పసుపు- కుంకుమ

• ఎన్నికలకు ముందు డ్వాక్రా సంఘాల రుణాలనుమాఫీ చేస్తానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు, సహాయం పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారు.

• రుణాలు కట్టవద్దంటూ ప్రచారం చేసి, వాటిని రద్దు చేయక పోవడంతో,కొత్త రుణాలు రాక, పాత వాటిపై వడ్డీ భారం పెరిగిపోయి డ్వాక్రా మహిళలు కుదేలు అయిపోయారు.

• వీటికి తోడు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు పొందడానికి అనర్హులై, చంద్రబాబు నిర్వాకంతో డ్వాక్రా సంఘాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిపోయింది.

• ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి సాయం పేరుతో, అప్పులను ఇస్తూ, ఆ మొత్తం కూడా విడతల వారీగా పోస్టు డేటెడ్ చెక్కుల రూపంలో ఇస్తామని మోసం చేయడం కాక మరోటి అవుతుందా.

• ఈ సాయంపై మీరు విడుదల చేసిన జీవో నెం 17 అంశాల మతలబు ఏమిటి? మీ నక్కజిత్తుల మోసాలకు అది నిదర్శనం కాదా?

• డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మల ఇబ్బందులు, నాలుగేళ్లపాటు మీకు కనిపించ లేదా చంద్రబాబు గారూ?

• ఈ కార్యక్రమానికి పసుపు- కుంకుమ అనే పేరును పెట్టి సెంటిమెంట్ తో లబ్ధి పొందాలన్న ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పై దాడి

• ఇది పూర్తిగా అప్రజాస్వామికం.

• ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిని తెలుగుదేశం కార్యక్రమాలుగా మార్చేశారు.

• జన్మ భూమి కమిటీల పేరుతో, ప్రతిపక్షాలకు చెందిన వారికి సంక్షేమ పథకాలను దూరం చేస్తున్న పచ్చ చొక్కాల నేతలు, ఇప్పుడు మరీ బరితెగించి పోతున్నారు.

• చంద్రబాబు నాయుడుకు, ఆయన ప్రభుత్వానికి , ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం విశ్వాసం లేదు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలన్న స్పృహ ఏనాడూ లేదు.

• పార్టీలు ఫిరాయించిన వారిపై, చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తూ, మరోవైపు ఏమాత్రం అవకాశం దొరికినా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై కేసులు పెట్టడం, హౌజ్ అరెస్టులు చేయడం వంటి ఏకపక్ష పోకడలు, నియంతృత్వ వైఖరికి ప్రభుత్వ చర్యలు అద్దం పడుతున్నాయి.

• గతంలో కర్నూలు జరిగిన కార్యక్రమంలో అక్కడి ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతుంటే, స్వయంగా ముఖ్యమంత్రే అడ్డుతగిలారు.

• అలాగే కడపలో జరిగిన కార్యక్రమంలో ఎంపి వైయస్అవినాష్ రెడ్డి మాట్లాడుతుంటే స్వయంగా ముఖ్యమంత్రే ఆయన వద్ద నుంచి మైక్ లాగేసుకోమంటూ హుకుం జారీ చేశారు.

• ఇలా స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సభల్లోనే స్థానిక ప్రజాప్రతినిధులకు(ప్రతిపక్షాలకు చెందిన వారికి) అవమానాలు జరుగుతుంటే, మిగిలిన సభల్లో గౌరవ మర్యాదలు ఎందుకిస్తారు.
సీపీఎస్ పథకం

• సీపీఎస్ గురించి ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నాయి.

• ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని , అధికారంలోకి వస్తే దీనిని రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలోనూ, ఇతరత్రా వేదికల్లోనూ స్పష్టంగా చెప్పారు.

• ప్రస్తుత అసెంబ్లీ చివరి సమావేశాల సందర్భంగా మరోసారి తమ సమస్యలను అందరికి దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళనను ప్రభుత్వం కర్కశంగా అణిచివేయాలనుకోవడం శోచనీయం.

• ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ ఛార్జీ చేయడం, అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం.

• ఒకపక్క చంద్రబాబు నాయుడే, తాను చేసిన మోసాల నుంచి ప్రజల దృష్టిని మరల్చి ,సానుభూతి పొందాలన్న తపనతతో దొంగ దీక్షలు, ఆందోళనలు చేస్తూ, హక్కుల సాధన కోసం, నిజమైన పోరాటాలు చేస్తున్న వారిని చిత్ర హింసలకు గురి చేయడం అత్యంత హేయనీయం.

అగ్రవర్ణ పేదలకు మోడీ ఇచ్చిన 10 శాతము రిజర్వేషన్ లలో ఓట్ల కోసం కాపులకు బాబు ఇచ్చిన ఉత్తుత్తి 5 శాతము రిజర్వేషన్ చెల్లదు-AP లాయర్ల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మరియు ఆలపాటి శ్రీనివాస్

గతం లో బాబు మాల మాదిగలకు ఇచ్చిన వర్గీకరణ కూడా చెల్లలేదు , పైగా అనవసరంగా కులాల మధ్య గొడవలు జరుగుతాయి
అసలు కాపులకు రిజర్వేషన్ ఎలా ఇస్తారు అని నేను టీడీపీ లో ఉన్నప్పుడు నాతోనే అన్నాడు బాబు -YCP MLC ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

కాబట్టి కాపు సోదరులు బాబు కళ్ల బొల్లి మాటలు నమ్మి మోసపోవద్దు

డ్వాక్రా మహిళలకు విజ్ఞప్తి..

చంద్రబాబు పసుపు కుంకుమ కింద చెక్కులిచాడని సంబర పడితే మీకే నష్టం.. ఆ డబ్బులు మీకు అప్పుగా ఇచ్చాడు.. తిరిగి కట్టాలి. లేదంటే మీ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటాడు. అందుకే చెక్కులు మీ పేరు మీద ఇవ్వకుండా… గ్రూప్ పేరు మీద ఇస్తున్నాడు. పర్సనల్ అకౌంట్ కి ఇస్తే రేపు కట్ చేసుకోవాలంటే అందులో డబ్బులు ఉండేవేమోనని ముందు జాగ్రత్తగా గ్రూప్ అకౌంట్ పేరు తో చెక్కులు ఇస్తున్నారు. పైగా… మీ డబ్బుల్లో 200 కట్ చేసి అందులో మీకే భోజనాలు పెట్టి , పసుపు కుంకుమ కార్యక్రమం కోసం ఖర్చు చేస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం… మీకిచ్చిన మూడు చిక్కుల్లో మీకు దక్కేది మొదటి విడతలో వచ్చే 2500 మాత్రమే. తర్వాత రెండు విడతల్లో ఇచ్చే 3500, 4 వేలు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న కారణంగా పంపిణీ సాధ్యం కాదు. ఉద్యోగులకే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు.. మీకిప్పుడు ఎందుకు ఇస్తున్నట్లు. ఎన్నికల కోసమే కదా. నిజంగా మీకు డబ్బులు ఇచ్చే ఉద్దేశ్యం చంద్రబాబు కి ఉండి ఉంటే.. మొదటి విడత లోనే 4వేల రూపాయల చెక్కు ఇచ్చి ఉండేవాడు..

దయచేసి గమనించండి… #నిన్నునమ్మంబాబు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా మూలాలు అక్కడే ఉంటాయి..NRI చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి #తెలుగు_తమ్ముడు కావడం విశేషం..

వీడు హైదరాబాద్ లో చంపి విజయవాడ లో శవం ఎందుకు వేశాడో తెలుసా..?

కేసు ఆంధ్ర లోకి వొస్తుంది చంద్రబాబు ద్వారా కేసు మీదికి రాకుండా పోలీసులు మేనేజ్ చేసుకోవచ్చు అని

ఆంధ్ర పోలీస్ అంటే ఎంత చీప్ అయ్యారో చుడండి….మర్డర్ చేసి ఓ పదో పరకో పడేస్తే సరిపోతుంది అనే స్థాయికి ఆంధ్ర పోలీసులను చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed