అరవై కోట్ల రూపాయల షరతు పెట్టిన బాబు…..

టిడిపి పార్టీలోకి చేరిన ఎస్పీవై ఇప్పుడు మరోసారి  నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు…ఫిరాయింపు ఎంపీ ఎస్పీవై రెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ మరోసారి దక్కడం కష్టంగానే ఉందని సమాచారం..ఈ విషయంపై.

బాబుకు విన్నవించుకోగా.. అరవై కోట్ల రూపాయల డబ్బులు రెడీగా ఉంచుకోవాలని, ఆ మేరకు బ్యాంక్ డిపాజిట్ పత్రాలను కూడా చూపించాలని చంద్రబాబు నాయుడు కోరినట్టుగా నంద్యాల్లో చర్చ జరుగుతోంది.

ఎంపీ టికెట్ కావాలంటే.. ఆ మేరకు ఖర్చు పెట్టుకునేందుకు రెడీగా ఉండాలని అన్నారట.

అయితే తాము ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని.. అలాంటిది ఇప్పుడు అరవై కోట్ల రూపాయలు రెడీ చేసుకోవాలని అంటే ఎలాగని.. ఎస్పీవై రెడ్డి ప్రశ్నించారు..

అయితే చంద్రబాబు నాయుడుకు ఎస్పీవైకి టికెట్ ఇచ్చే ఉద్దేశం మే లేదని.. అందుకే, ఈ అరవై కోట్ల రూపాయల షరతు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి.  ఎస్పీవై వర్గం నుంచి కూడా ఇదే అభిప్రాయమే వినిపిస్తోంది.

పొమ్మనకుండా పొగబెడుతున్నారని.. అందులో భాగంగానే అరవై కోట్ల రూపాయల  డిపాజిట్ అడుగుతున్నారని ఆ వర్గం వారు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నంద్యాల ఎంపీ టికెట్ ను బాబు ఎవరికి ఖరారు చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ భారీ ఖర్చును పెట్టుకోవడానికి అనుగుణంగా భూమా అఖిలప్రియను బాబు నంద్యాల నుంచి ఎంపీగా బరిలోకి దించాలని భావించారట. అయితే ఆమె అందుకు ససేమేరా అంటున్నారని సమాచారం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *