‘సిరివెన్నెల’. ఈ చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్

ఏఎన్‌బీ కోర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సిరివెన్నెల’. ఈ చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

సినీ
పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లలోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు
అందుకున్న ప్రియమణికి ఉత్తరాదిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో
జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘యమదొంగ’లో నటించి మెప్పించింది. ఆ తరవాత నాగార్జున,
జగపతిబాబు, కళ్యాణ్ రామ్, నితిన్, గోపీచంద్ వంటి ప్రముఖ హీరోలతో నటించినా
కమర్షియల్ హిట్లు అందుకోలేకపోయింది. దీంతో మెల్లగా అవకాశాలు కూడా
తగ్గిపోయాయి. మరోవైపు పెళ్లి కూడా చేసుకోవడంతో సినిమాలకు దూరమై టీవీ షోలలో
న్యాయనిర్ణేతగా సెటిలైపోయింది. అయితే తెలుగులో తన పూర్వవైభవాన్ని
సంపాదించుకునే ప్రయత్నాలను మాత్రం ప్రియమణి
ఆపడంలేదు. మూడేళ్ల క్రితం ‘మన ఊరి రామాయణం’ చిత్రంలో కనిపించిన ప్రియమణి..
ఇప్పుడు ప్రధాన పాత్రధారిగా సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెడుతోంది.
ఏఎన్‌బీ
కోర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల
దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సిరివెన్నెల’. ఈ చిత్రం ద్వారా
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగు చిత్ర సీమలో క్లాసిక్
మూవీగా చెప్పుకునే ‘సిరివెన్నెల’ సినిమా టైటిల్ ఇన్నాళ్ల తర్వాత మరో
సినిమాకు వాడుతున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటన ప్రెస్ మీట్‌ను అల్యూమినియం
ఫ్యాక్టరీలో జరుగుతోన్న షూటింగ్ స్పాట్‌లో ప్రియమణి ప్రకటించింది.
‘సిరివెన్నెల’ కథ నచ్చడంతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో
నటించేందుకు ఒప్పుకున్నానని ప్రియమణి చెప్పారు.

‘సిరివెన్నెల’ లోగో పోస్టర్ ప్రియమణికి పర్‌ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల
ఉండనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు
జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, ‘కాలకేయ’ ప్రభాకర్,
సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ కీలక పాత్రల్లో నస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియమణి.. ‘చాలా రోజుల తర్వాత తెలుగు
సినిమా చేస్తున్నాను. నాకోసం ముంబై వచ్చి కథ చెప్పారు. థ్రిల్లర్ జోనర్
అయినప్పటికీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చిన్న వయసులో సాయి తేజ మంచి పాత్ర
చేస్తుంది. మా డైరెక్టర్ చాలా కూల్. ప్రభాకర్ చాలా మంచి క్యారెక్టర్
చేశారు. మా నిర్మాతలకు చాలా థాంక్స్. సూపర్ నేచురల్ సంబంధ విషయాలు
నేర్చుకునే ప్రాసెస్‌లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని డైరెక్టర్
థ్రిల్లింగ్‌గా చెప్పారు’ అని వెల్లడించారు.