YSRCPకి షాక్: హైకోర్టు నోటీసులు.. సెప్టెంబర్ 3 డెడ్‌లైన్

హైకోర్టు ఎన్నికల కమిషన్, వైఎస్సార్‌సీపీకి నోటీసులు ఇచ్చింది.. సెప్టెంబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచించింది.
తదుపరి విచారణ సెప్టెంబర్ 3కు వాయిదా పడింది.
వైఎస్సార్‌సీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
ఈ పిటిషన్‌లో ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల కమిషన్, వైఎస్సార్‌సీపీకి నోటీసులు ఇచ్చింది..
సెప్టెంబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచించింది.
తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
కడపకు చెందిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈ పిటిషన్ వేశారు.
దీనిపై హైకోర్టు విచారణకు స్వీకరించి విచారణ జరిపింది. మహబూబ్ బాషా ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్సార్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు.
ఇదిలా ఉంటే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుపై అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే.
పార్టీ తరఫున షోకాజ్ నోటీసు పంపిన జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ఘాటుగా విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమైంది.
పార్టీ విషయాలపై బహిరంగంగా మాట్లాడుతున్న రఘురామ కృష్ణంరాజుపై మండిపడ్డ వైసీపీ అధిష్టానం ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చూయాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
ఈ తరుణంలో మరోసారి వైసీపీ రద్దు వ్యవహారం చర్చనీయాంశమైంది.