మ్యాప్‌‌లను చింపేసి, డాక్యుమెంట్లు మింగేసి.. శభాష్ అభినందన్

పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కిన అభినందన్ శుక్రవారం విడుదలవుతున్నాడు. పారాచ్యూట్ సాయంతో కిందకు దిగగానే అసలు అభినందన్ ఏం చేశాడు. పాక్ మీడియా కథనాలను చూస్తే అభినందన్‌ను రియల్ హీరో అనక మానరు.

పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కిన అభినందన్

శుక్రవారంవిడుదలవుతున్నాడు.పారాచ్యూట్ సాయంతో కిందకు దిగగానే అసలు అభినందన్ ఏం చేశాడు.పాక్ మీడియా కథనాలను చూస్తే అభినందన్‌ను రియల్ హీరో అనక మానరు.

విడుదలవుతున్నాడు.పారాచ్యూట్ సాయంతో కిందకు దిగగానే అసలు అభినందన్ ఏం చేశాడు.పాక్ మీడియా కథనాలను చూస్తే అభినందన్‌ను రియల్ హీరో అనక మానరు.

పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కిన భారత పైలెట్ అభినందన్ వర్థమాన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్ ప్రకటించగానే భారత్‌లో హార్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బుధవారం పాక్ ఫైటర్ జైట్‌ను వెంబడిస్తూ.. మిగ్-21 బిసాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అభినందన్ బయల్దేరి వెళ్లాడు.

పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో పారాచ్యూట్ సాయంతో కిందకు దిగిన అభినందన్.. పాక్‌ భూభాగంలో దిగగానే సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. అభినందన్ పట్టుబడిన తర్వాత ఏం జరిగిందనే విషయమై పాకిస్థాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

వాటి ప్రకారం..

‘నియంత్రణ రేఖకు ఏడు కి.మీ. దూరంలో మిగ్-21 క్రాష్ ల్యాండయ్యింది. పారాచ్యూట్ సాయంతో సురక్షితంగా కిందకు దిగిన పైలెట్‌ను స్థానికులు చుట్టుముట్టారు. ఇది భారతా? పాకిస్థానా?, నేను ఎక్కడున్నానని అభినందన్ అడగ్గా.. భారత్ అని స్థానికులు తప్పుడు సమాధానం ఇచ్చారు. కానీ వెంటనే తాను పీవోకేలో ఉన్న విషయాన్ని వింగ్ కమాండర్ అభినందన్ గుర్తించాడు.

మూక బారి నుంచి తనను రక్షించుకోవడం కోసం గాల్లోకి కాల్పులు జరిపిన అభినందన్ నియంత్రణ రేఖ దిశగా పరిగెత్తాడు.

కానీ స్థానికులు అతణ్ని వెంబడించారు. దీంతో వారిని బెదిరించడం కోసం అభినందన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. కానీ ఇక తప్పించుకొని భారత్ చేరడం తన వల్ల కాదని నిర్థారించుకున్నాక.. దగ్గర్లోని నీటి మడుగులో దూకేశాడు.

ఆపరేషన్‌కు సంబంధించి తన దగ్గరున్న డాక్యుమెంట్లు, మ్యాప్‌లు పాకిస్థాన్ చేతికి చిక్కొద్దనే ఉద్దేశంతోనే పైలెట్ ఇలా చేశాడు.

అతడు కొన్ని పేపర్లను చింపేసి మింగేసే ప్రయత్నం చేశాడు. నీటిలో తడిస్తే పేపర్లు పనికి రావనే ఉద్దేశంతోనే అభినందన్ నీటిలోకి దూకాడు.

కాసేపటికే అక్కడికి చేరుకున్న పాక్ సైనికులు భారత పైలెట్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భీమ్‌బెర్‌లోని ఆర్మీ స్థావరానికి తీసుకెళ్లారు’ ఇది పాక్ మీడియా కథనం. ఈ విషయమై ఇప్పటి వరకూ భారత్ అధికారికంగా స్పందించలేదు.

బుధవారం ఉదయం పాకిస్థాన్ జెట్లు భారత గగనతలంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్లోని మన సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించింది.

కానీ భారత వైమానిక దళం ఆ దాడులను తిప్పి కొట్టింది. పాకిస్థాన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చాక.. అభినందన్ నడుపుకుంటూ వెళ్లిన మిగ్-21 పీవోకేలో కుప్పకూలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *