నేపాల్ లో కూలిన హెలికాప్టర్ ఏడుగురు దుర్మరణం*

నేపాల్ లొ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ ప్రైవేటు విమానo కోండను డీ కొట్టి కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న పర్యాటక ,పౌర విమానయాన శాఖ మంత్రి రవీంద్ర అధికారి( 39).

మరో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

మృతుల్లో నేపాల్ కు చెందిన ప్రముఖ విమానయాన వ్యాపారి అంగ్ శేరింగ్ షేర్ ప, ప్రధాని వ్యక్తిగత సహాయకుడు యుబ రాజ్ దహల్, మరో ఇద్దరు పౌరవిమానయాన అధికారులు ఓ సైనిక అధికారి ఉన్నారు.

రభీంద్ర బుధవారం నేపాల్ లోని ప్రముఖ పాతి బారా దేవి హిందూ ఆలయం దర్శించుకొని “ఎయిర్ డైనాసీరి ” హెలికాఫ్టర్ లొ ఖాట్మాండుకు తిరుగు ప్రయాణమయ్యారు.

కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత హెలికాప్టర్ చూచె డాడా అనే కొండను ఢీ కొట్టింది.

ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగి హెలికాప్టర్ కుప్పకూలి పోయింది ,అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు.

మంటలు చెలరేగిన తరువాత భారీ శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు.

అడుగడుగునా కొండలకు తోడు దట్టంగా మంచు కప్పి ఉండటం తో నేపాల్ లో గగనవిహారం అత్యంత సవాల్గా మారింది.

తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి కాగా దుర్గటన అనంతరం తన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రధాని తన అధికార నివాసం లొ అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.

ఘటనా స్థలం నుంచి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *