కేబినెట్‌లో బెర్త్ దక్కని మాజీ మంత్రులు సీఎం కేసీఆర్‌పై అలక బూనినట్లు తెలుస్తోంది

సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

తెలంగాణ కేబినెట్ కూర్పుపై సీనియర్ల అలకబూనినట్లు సమాచారం తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టే యోచనలో సీఎం కేసీఆర్.

తెలంగాణలో రెండు నెలల ఉత్కంఠకు తెరదించారు ముఖ్యమంత్రి కేసీఆర్. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.

కేబినెట్ విస్తరణకు మాత్రం కేసీఆర్ రెండు నెలల సమయం తీసుకున్నారు. చివరకు పది మందితో కేబినెట్ విస్తరణకు సోమవారం నిర్ణయం తీసుకున్నారు.

ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసానిశ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, చామకూర మల్లారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

వీరంతా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

గత కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసానిశ్రీనివాస్ యాదవ్‌కు కేసీఆర్ రెండోసారి అవకాశం ఇచ్చారు.

దీంతో గతంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు అవకాశం రానివారు కేసీఆర్‌పై అలకబూనినట్లు సమాచారం.

హైదరాబాదు నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చెల్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.

కేబినెట హైదరాబాదు నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చెల్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.

కేబినెట్‌లో బెర్త్ దక్కని మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తనకు కాకుండా టీడీపీ అభ్యర్థిగా తనతో పలుమార్లు తలపడిన శ్రీనివాసయాదవ్‌కు స్థానం కల్పించటంపై పద్మారావు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

తలసానికి మంత్రి పదవి ఇవ్వటంపై తనకు అభ్యంతరం లేదని, అదే సమయంలో తనకు కూడా ఇస్తే సరైన గౌరవం ఉంటుందని పద్మారావు పార్టీ ముఖ్యనేతల వద్ద అన్నట్లు తెలుస్తోంది. అయితే పద్మారావుకు కేబినెట్‌ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *