అంతమంది బాలీవుడ్ భామలుండగా.. సారా అలీ ఖాన్‌కే ఆ ఆఫర్ ఎందుకు?

కంపెనీలు ప్రస్తుతం ఎవరినైనా బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకోవాలంటే వారి సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను చూస్తున్నాయి. సారా అలీ ఖాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.

హెయిర్ రిమూవల్ బ్రాండ్ వీట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక. బాలీవుడ్ పరిశ్రమలోకి కొత్తగా ఎంట్రీ. వయసు కూడా తక్కువే సోషల్ మీడియాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు

ప్రపంచపు నెంబర్ 1 హెయిర్ రిమూవల్ బ్రాండ్ వీట్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

ఈ బ్రాండ్ ఇప్పటికే పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో హెయిర్‌ను ఎంత సులువుగా తీసేసుకోవచ్చో చూపిస్తారు.

బాలీవుడ్‌లో చాలా మంది యంగ్ హీరోయిన్‌లు ఉన్నారు. వీట్ వీరందరినీ కాదని సారా అలీ ఖాన్‌ను మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా ఎందుకు తీసుకుంది? వీట్ తన బ్రాండ్ ప్రమోషన్‌ బాధ్యతలను సారాకు ఎందుకు అప్పగించినట్లు? తెలుసుకుందాం పదండి..

సారా అలీ ఖాన్‌ది బబ్లీ నేచర్. బాలీవుడ్ పరిశ్రమలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. చాలా యంగ్. వీట్ కూడా యంగ్ కస్టమర్లే లక్షంగా ముందుకు వెళ్తోంది. అందుకే సారాను ఎంపిక చేసుకుంది.

అలాగే సారా అలీ ఖాన్ ఇంకా తానేంటో నిరూపించుకోవాల్సి ఉంది. వయసు కూడా 23 ఏళ్లే. అందుకే వీట్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

కంపెనీలు ప్రస్తుతం ఎవరినైనా బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకోవాలంటే వారి సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను చూస్తున్నాయి.

సారా అలీ ఖాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఈ అంశం కూడా ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడానికి మరో కారణమై ఉండొచ్చు.

కేదర్‌నాథ్, సింబ సినిమాలతో తానేంటో తెలియజేసింది సారా. ఆమె ఇతర బాలీవుడ్ హీరోయిన్ల మాదిరి కాకుండా పబ్లిక్‌లో ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు.

అలాగే ఈమె బాలీవుడ్‌లో విజయవంతమౌతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే వీట్ సారాను ఎంపిక చేసుకొని ఉంటుంది.

కాగా సారా అలీ ఖాన్‌ ఒక బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఇది కూడా వీట్‌కు సానుకూల అంశమే.

మొత్తంగా చూస్తే యంగ్, పాపులర్, కొత్త, సక్సెస్, సోషల్ మీడియా వంటి అంశాల నేపథ్యంలో వీట్.. సారా అలీ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *