ఏపీకి తరలుతున్న రియల్ డబ్బు నాలుగురోజుల్లో రూ.7కోట్లు పట్టివేత

  • హైదరాబాద్ కేంద్రంగా సరఫరా –
  • ఏపీ ఓటర్లకు పంచేందుకు పచ్చ పార్టీ పక్కా ప్లాన్ –
  • నాలుగురోజుల్లో రూ.7కోట్లు పట్టివేత –
  • ఉత్తమ్, రేవంత్‌లకు చెందిన సొమ్ము ఉన్నట్టుగా గుర్తింపు

హైదరాబాద్‌లో స్థిరపడిన కొందరు టీడీపీ అనుకూల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏపీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఓటర్లను ప్రభావితం చేసేందుకే నగదు చేరవేస్తున్నట్టు సమాచారం. పక్కా ప్లాన్ ప్రకారం ఏపీకి డబ్బు మూటలు తరలించేం ప్లాన్‌ను తెలంగాణ పోలీసులు చిత్తుచేశారు.

హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నాలుగురోజుల్లో దాదాపు రూ.7 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

హైదరాబాద్ ఆరాంఘర్ చౌరా స్తా వద్ద అనంతపురం జిల్లా టీడీపీ నేతకు చెందిన రూ.24 లక్షల నగదు, హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ వద్ద ఏపీ టీడీపీ ఎంపీ మురళీమోహన్‌కు చెందిన రియల్‌ఎస్టేట్ కంపెనీ జయభేరి ఉద్యోగులు రూ.2 కోట్లు తరలిస్తూ దొరికిపోయారు.

ఈ నెల 4న హబ్సిగూడలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనుచరుల నుంచి రూ.47.75 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. అలాగే సోమాజిగూడలో రూ.26.19 లక్షలతో ముగ్గురు పట్టుబడ్డారు.

మూసారాంబాగ్‌లో చిత్రపురి లేఅవుట్‌లో నివాసముండే కాంట్రాక్టర్ తాండ్ర కాశీనాథ్‌రెడ్డి, డ్రైవర్ భూక్యానాయక్ నుంచి రూ.34.30 లక్షలు,

బంజారాహిల్స్‌లో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా అప్పారావుపేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి మల్లారెడ్డి శ్రీనివాస్‌కు చెందిన ఇన్నోవా కారు(ఏపీ09సీటీ 0248)లో రూ.కోటి,

పంజాగుట్టలో రూ.26లక్షలు, గోల్కొండ పీఎస్ పరిధిలో రూ.2 లక్షలు, ఎస్సార్‌నగర్ పీఎస్ పరిధిలో రూ.3.65 లక్షలు,

జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో రూ.1.49 కోట్లు, టప్పాచబుత్రా లో1.49 కోట్లు, టప్పాచబుత్రా లో రూ.4 లక్షలు పట్టుబడ్డాయి.

బంజారాహిల్స్‌లో కాంగ్రెస్ నేత కే జానారెడ్డిదిగా అనుమానిస్తున్న కారు (ఏపీ 29పీ 9999)లో తరలిస్తున్న నగదు రూ.కోటి పట్టుబడింది. ఈ మొత్తాన్ని నల్లగొండ కాంగ్రె స్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోసం తీసుకెళ్తున్నట్టు జానారెడ్డి కారు డ్రైవర్ శీనయ్య పోలీసులకు వెల్లడించారు.

పట్టుబడిన మొత్తంలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ సంస్థల నల్లధనమేనని అధికారులు చెప్తున్నారు.

నగదు పంపిణీపై పటిష్ఠ నిఘా: సీపీ అంజనీకుమార్

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండురోజుల్లో రూ.4.92 కోట్ల నగదు స్వాధీ నం చేసుకొన్నట్టు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండురోజుల్లో పట్టుబడిన నగదు నల్లగొండ, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.29 కోట్ల నగదును పట్టుకొన్నట్టు చెప్పారు.

ఇప్పటివరకు రూ.49.10 కోట్లు సీజ్: ఈసీ

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటినుంచి ఆదివారం ఉదయం వరకు మొత్తం రూ.49.10 కోట్ల విలువచేసే నగదు, మద్యం, ఇతరత్రా వస్తువులు పట్టుబడినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇందులో రూ.41,85,18,803 నగదు కాగా, రూ.3,93,42,905 విలువైన 2,86, 799 లీటర్ల మద్యం, రూ.2,75,11,980 విలువచేసే డ్రగ్స్, రూ.26,76,840 విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.29, 43,160 విలువచేసే బియ్యం, మారుతీ కారు ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొన్నది.

ఇలాఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 403 మందిపై కేసులు నమోదుచేసినట్టు తెలంగాణ పోలీసుశాఖ వెల్లడించింది. 8,525 ఆయుధాలను స్వాధీనం చేసుకొని, 33 లైసెన్సులను రద్దుచేసినట్టు తెలిపింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 19,441 కేసుల్లో 87,082 మందిని బైండోవర్ చేసి 3,922 మందికి ఎన్‌బీడబ్ల్యూ వారెంట్లు జారీచేశారు.

ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ వద్ద తనిఖీల్లో ముస్కాన్ ట్రావెల్స్ బస్సులో రూ.1.12 లక్షల నగదు లభించింది.

ఆధారాలు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకొని ట్రావెల్స్ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదుచేశారు.

అలాగే నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం గుడిపల్లి వద్ద వాహన తనిఖీల్లో సముద్రాల కిరణ్ నుంచి ఆధారాలు చూపని రూ.1.5 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *