వైఎస్ జగన్ సీఎం చేసేందుకు ప్రతి మహిళ కంకణం కట్టుకోవాలని రోజా పిలుపు

జగన్ అధికారంలోకి వస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయి మహిళలను సీఎం చంద్రబాబు తీవ్రంగా వంచించారు.
వైఎస్ జగన్ సీఎం చేసేందుకు ప్రతి మహిళా కంకణం కట్టుకోవాలని రోజా పిలుపునిచ్చారు.
ఎన్నికల ముందు మహిళలు ఓటు వేస్తారని ఉద్దేశంతోనే పసుపు ,కుంకుమ పేరుతో 10,000 ఇస్తాం అంటూ డ్రామాలు ఆడుతున్నారు.
పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బును అధికారంలోకి వస్తే ముక్కుపిండి వసూలు చేసుకుంటారు .
చంద్రబాబు మాయ మాటలు నమ్మవద్దని వైఎస్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్ కే రోజా అన్నారు.
గురువారం శాఖ జిల్లా చోడవరంలో పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో మహిళా గర్జన కార్యక్రమం జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన రోజా మాట్లాడారు, అమరావతిలో జగన్ సొంత ఇల్లు కట్టుకొని అడుగుపెట్టిన రోజు విశాఖకు రైల్వేజోన్ వచ్చింది.
అలాగే ఆయన అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా రావడం తథ్యం.
అమరావతిలో సొంతిల్లు కలిగిన ఏకైక నేత జగన్, ఇతరులెవ్వరికీ ఇక్కడ సొంతిల్లు లేవు.
అధికారంలోకి వస్తే మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు ,తన కోడలు బ్రాహ్మణిని పారిశ్రామికవేత్తగా చేశారు.
ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు లాంటి లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చారు. నిరుద్యోగులకు మాత్రం ఉపాధి చూపించలేకపోయారు.
చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఒకరికి ఒకరు తీసుపొరు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అని రోజా విమర్శించారు.