హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అల్కాజర్ మాల్ లో జనాల్ని ఆకట్టుకుంటున్న రోబో రెస్టారెంట్…. చిట్టమ్మ ది వెయిటర్

జూబ్లీహిల్స్‌లోని అల్కాజర్ మాల్‌లో ఈ రోబో రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

రెస్టారెంట్‌లోకి వెళ్లగానే మీ దగ్గరకు తెలుపు, నీలం రంగులో ఉండే రోబో వెయిటర్లు వస్తారు.

 ‘హాయ్.. చిట్టి ది రోబో’ అంటూ శంకర్ సినిమా ‘రోబో’లో మరమనిషి మనందరినీ అలరించింది. బాస్ వసీకర్ చెప్పిన పనులన్నీ చేయడమే కాకుండా సనాను ప్రేమించింది, ఆమె కోసం బాస్‌తో యుద్ధమే చేసింది. అది సినిమా అనుకోండి.

అయితే మన కోసం ఇదంతా చేయకపోయినా మనం ఆర్డర్ చేసే ఫుడ్ తీసుకురావడానికి, వడ్డించడానికి రోబోలు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేశాయి.

అవునండి, రోబోలు వెయిటర్లుగా ఉన్న రెస్టారెంట్ ఒకటి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేశంలో ఇది మూడో

రోబో రెస్టారెంట్. ఇప్పటికే చెన్నై, కోయంబత్తూర్‌లో ప్రారంభమయ్యాయి.

జూబ్లీహిల్స్‌లోని అల్కాజర్ మాల్‌లో ఈ రోబో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రెస్టారెంట్‌లో తెలుపు, నీలం రంగులో ఉండే ఆడ రోబో వెయిటర్లు కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేస్తున్నాయి.

మీరు టేబుల్‌పై కూర్చొని ట్యాబ్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. క్షణాల్లో ఆహారాన్ని స్వయంగా మీ దగ్గరకు తీసుకువస్తాయి.

ఇంత అధునాతన రోబో రెస్టారెంట్‌ను ఏర్పాటుచేసింది ఏ అంతర్జాతీయ కంపెనీనో అనుకుంటే పొరపాటే.

మన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు ప్రసిధ్ సేతియా, మణికంఠ గౌడ్, మణికంఠ యాదవ్ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

ఈ రెస్టారెంట్‌లోని ఒక్కో రోబో ఖరీదు రూ.5 లక్షలు. ఈ రోబో రెస్టారెంట్‌కు వచ్చే స్పందనను బట్టి ఈ ఏడాది చివరి నాటికి మరింత అధునాతన రోబోలను తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

మరి ఈ రోబో రెస్టారెంట్‌కు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *