ఓటుకు నోటు కేసు.. సంబంధించి వీడియో పుటేజీల్లో రేవంత్ చిక్కుకున్నారు

ఈడీ ముందుకు రేవంత్!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటుకు నోటు కేసు విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు వెళ్లాల్సి ఉంటుందట కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి.

ఈ కేసులో నిందితుల్లో ఒకరిగా ఉన్న వేంనరేందర్ రెడ్డి ఈ రోజు ఈడీ ముందు హాజరయ్యారు. వేం నరేందర్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకే నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ఓటును కొనేందుకు టీడీపీ ప్రయత్నాలు సాగించింది.

అందుకు సంబంధించి వీడియో పుటేజీల్లో రేవంత్ చిక్కుకున్నారు.

ఈ నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి దగ్గర నుంచి సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది.

నరేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారానికి… ఈడీ దగ్గర ఉన్న ఆధారాలకూ పొంతన లేదని తెలుస్తోంది.

అదలా ఉంటే.. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోందని సమాచారం.

వారం రోజుల్లో రేవంత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సమాచారం.

స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన యాభై లక్షల రూపాయలు ఎక్కడివి, ఎమ్మెల్సీ ఎన్నిక అనంతరం ఇవ్వజూపిన నాలుగున్నర కోట్ల రూపాయల మొత్తం మూలాలు ఎక్కడున్నాయి.. అనే అంశాల గురించి ఈడీ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.

ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఈ కేసులో మరిన్ని  కీలక పరిణామాలు చోటు చేసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *