చెత్త ప్రశ్నలు అడగొద్దని రేణు దేశాయ్ అసహనం

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు తన ప్రొఫెషన్, పిల్లల పెంపకంలో బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో లైవ్ చాట్ చేస్తుంటారు.

ఇటీవలరేణు దేశాయ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు చెత్త ప్రశ్నలు అడిగ్గా ప్రశ్న అడిగిన ఆ వ్యక్తిపై రేణు విరుచుకుపడింది.

‘మీకు అసలు బుద్ది లేదు, లైవ్‌లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? కాస్త ఆలోచించండి, మీ లాంటి వారు బుద్ది లేకుండా వచ్చేస్తారు. ఏదో చెత్త విషయాలు అడుగుతారు.’ అంటూ విరుచుకుపడింది. బిగ్ బాస్ షోకి రావొచ్చుగా మేడం అని అడగగా… నేను బిగ్ బాస్ లాంటి షోలో పాల్గొనే పర్సన్ కాదు. నాకు ఎప్పుడూ కెమెరా ముందు ఉండటం ఇష్టం ఉండదు.

మీతో లైవ్ కూడా రెండు మూడు నెలలకు ఒకసారి చేస్తాను. నేను చాలా షై పర్సన్. అయినా నా పిల్లలను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేను. అలాంటిది వంద రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండటం అంటే అసాధ్యం. ఒక్క రోజు గెస్టుగా రమ్మని చెప్పినా నేను వెళ్లను… అని రేణు దేశాయ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *