రాష్ట్రంలో సర్వే పేరుతొ వైకాపా సానుభూతిపరుల కు సంబంధించిన ఓట్ల తొలగింపు

రాష్ట్రంలో సర్వే పేరుతో వైకాపా సానుభూతిపరుల కు సంబంధించి 56 లక్షల మంది ఓట్లు తొలగించారు. అధికారపార్టీకి పోలీసులు, తాసిల్దారు లు సహకరిస్తున్నారు.

బాధ్యులైన వారిని విధుల నుంచి తప్పించాలి అని వైకాపా సీనియర్ నేతలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ దివేదికి సోమవారం ఫిర్యాదు చేశారు .

అనంతరం వారు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల తీరును ప్రశ్నించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమిళనాడు తీసుకెళ్లి హింసించి తెల్లవారుజామున సత్యవేడు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.

అక్కడ సర్వేకు సహకరిస్తున్న చిత్తూరు ఎస్పీని వెంటనే బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అధికార పార్టీ గెలవాలి అంటే ఇతరుల ఓట్లు ఉండకూడదని తొలగిస్తున్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కొనసాగుతోంది.

ఈ దూరాగతలను వేంటనే అరికట్టాలని పేర్కొన్నారు .గురజాల నియోజకవర్గం వైకాపా నేత ఆత్మహత్యాయత్నానికి కారకుల పై ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.

గురజాల సి ఐ ని వెంటనే సస్పెండ్ చేయకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కొనసాగిస్తామని, ఐ కోర్టుకెళ్లిన న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తామని వైకాపా నేత కాసు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *