February లో బయోపిక్ విడుదల.. ‘మహా’ కల్లోలం సృష్టిస్తోంద? లేదా?

బయోపిక్ విడుదల.. ‘మహా’ కల్లోలం

ఎన్టీఆర్ బయోపిక్ రెండోభాగం విడుదల ‘మహా’ కల్లోలం సృష్టిస్తోంది.

అయితే ఇది ఎవరికీ తెలియని కల్లోలం.

ఇండస్ట్రీ జనాలకు మాత్రం కొద్దిగా తెలిసిన వైనం. గత కొన్నాళ్లుగా బాలయ్య బంధువు, ఆ సినిమా నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఎమ్మార్వీ ప్రసాద్ కు బయ్యర్లకు మధ్య నడుస్తున్న వ్యవహారాల గురించి గ్రేట్ ఆంధ్ర ఎప్పటికప్పడు వార్తలు అందిస్తూ వస్తోంది.

‘అబ్బే అదేం లేదు’ అని యూనిట్ సైడ్ నుంచి వాదనలు వినిపిస్తూ వచ్చాయి. సినిమా నిర్మాణంలో కీలకమైన నిర్మాత సాయి కొర్రపాటిని పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతోందని.

గతంలో వదంతులు వినవచ్చిన విషయాన్ని కూడా వెల్లడించాం. అవన్నీ కాకమ్మ కబుర్లు అంటూ కొట్టిపారేసేవారు యూనిట్ జనాలు.

కానీ దాదాపు ఇప్పుడు అవన్నీ నిజాలై కూర్చుంటున్నాయని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో బయ్యర్లంతా ఎనబైశాతం నష్టపోతుంటే, రెండోభాగం ఫ్రీగా ఇవ్వడం అన్న కాన్సెప్ట్ నే ఇప్పుడు కాదంటున్నారని టాక్.

ముఖ్యంగా సాయి కొర్రపాటి పంపిణీ చేసిన ఏరియాలు అయిన వైజాగ్, కృష్ణా, సీడెడ్ వేరే వాళ్ల చేతుల్లో పెడుతున్నారని వినికిడి.

వైజాగ్, కృష్ణలను సురేష్ మూవీస్ చేతిలో, సీడెడ్ ను ఎన్వీ ప్రసాద్ చేతిలో పెడుతున్నారు. అదే విధంగా మూడువంతులు నష్టపోయిన ఓవర్ సీస్ బయ్యర్ ను మరో మూడుకోట్లు కట్టమంటున్నారు.

లేదంటే సినిమా ఇచ్చేది లేదంటున్నారని టాక్.

దీంతో వీళ్లంతా ఎన్బీకె ఫిలింస్ ఆఫీస్ దగ్గర వుండి కిందామీదా అవుతున్నారని తెలుస్తోంది.

సాయి కొర్రపాటిని ఈ కల్లోల పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు బాలయ్య సన్నిహితుడు ఒకరు ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా.

మొత్తంమీద మహానాయకుడు విడుదల మామూలు వ్యవహారంగా కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *