జయరాం హత్య కేసు: రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి కాల్ డేటా లభ్యం…

ప్రముఖ వ్యాపార వేత్త ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసులో చిక్కుముడులు విప్పేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రయత్నాలు గట్టిగానే చేశారు.

ఈ మేరకు జయరాం హత్య చేసింది రాకేష్ రెడ్డి, అతనికి సహకరించిన వాచ్మెన్లు, అని నిర్ధారించి… అందరిని నందిగామ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో మొదటి నుంచి వినిపించిన పేరు శిఖా చౌదరి.. అయితే ఆమెను విచారించిన తరువాత ..ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చారు ఏపీ పోలీసులు.

దీంతో ఈ కేసులో జయరాం భార్య పద్మశ్రీ శిఖా చౌదరిపై ఆరోపణలు వ్యక్తం చేశారు.

జయరాం హత్యకేసులో శిఖా చౌదరితో పాటు, తనకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

తెలంగాణ పోలీసులు విచారిస్తే.. తనకు న్యాయం జరుగుతుందని ఆమె డిమాండ్ చేశారు.వరస ఆరోపణలతో ఏపీ పోలీసులు జయరాం కేసును హైదరాబాద్ కు బదిలీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా దర్యాప్తు కొనసాగించారు.

ఇప్పటికే అరెస్టు అయిన రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను పిటీ వారెంట్పై హైదరాబాద్ కు తరలించారు. ఎల్బీనగర్ హస్తినాపురం లోని నాంపల్లి కోర్టు జడ్జి ఇంటిముందు నిందితులను ప్రవేశ పెట్టారు.

నిందితులకు 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.

ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను వేయనున్నారు.

ఇవాళ పిటిషన్ వేస్తే బుధవారం పిటిషన్ కు నెంబర్ అయ్యే అవకాశం ఉంటుంది. గురువారం, శుక్రవారం రోజుల్లో పోలీస్ కస్టడీ పిటిషన్ పై పబ్లిక్ అడ్వకేట్ తో పాటు నిందితుల తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తారు.

పోలీసులు 14 రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరే అవకాశం ఉంది.

ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఇద్దరు నిందితులను ఐదు నుంచి ఏడురోజుల వరకు పోలీస్ కస్టడీ కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి లా కాల్ షీట్ డేటా వివరాలను పోలీసులు తెప్పించారు. పద్మశ్రీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.

ఇద్దరు నిందితులను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న తర్వాత… సీన్ అఫ్ అప్షన్స్ ప్లేస్ లో సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది.

అలాగే రాకేష్ రెడ్డి ని విచారించినప్పుడు ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న శిఖా చౌదరిని సి ఆర్ పి సి సెక్షన్ 41 కింది నోటీసులు జారీ చేసి ఇద్దరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

అయితే పోలీస్ కస్టడీ విచారణలో నందిగామ పోలీసులు తేల్చిన విషయం రిపీట్ అవుతుందా లేక ఆసక్తికరమైన అంశాలు బయటపడతాయనేది వేచి చూడవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *