చెన్నై ముంబై ఢిల్లీ కొలకత్తా లను కలుపుతూ రైల్వే స్వర్ణ చతుర్భుజి కారిడార్లు

సులబoగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి స్వర్ణ చతుర్భుజి పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ సంసిద్ధమైంది.
ప్రధాన నగరాలైన చెన్నై ముంబై ఢిల్లీ కొలకత్తా లను కలిపి నడవాలి కారిడార్లు పూర్తయితే ప్రస్తుత ప్రయాణ సమయం తక్కువ కానుంది.
స్వర్ణ చతుర్భుజి “ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితమే రైల్వే శాఖ ఆలోచన చేసింది.
దానికి అనుగుణంగా ప్రాజెక్టును రూపొందించింది.
నాలుగు ప్రధాన నగరాలను కలిపే రైలు మార్గాలను గంటకు 160 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా నవీకరించడం అవసరమైన చోట నూతనంగా నిర్మించడం ద్వారా ప్రస్తుత ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గించేలా ప్రణాళిక రచించింది.
చేపట్టాల్సిన పనులు, పరిధి ,అంచనా వ్యయం తదితర విషయాలపై కూలంకషంగా అధ్యయనం చేసి నివేదించాలని దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య, ఉత్తర మధ్య రైల్వే జోన్ ల ను ఆదేశించింది. ఆ వివరాలను జోన్లు ఇప్పటికే అందజేశాయి.
వీటికి ఆమోదం లభించడమే మిగిలింది చతుర్భుజి పనులు పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే ప్రస్తుతం దాదాపు 30 గంటలు పడుతుంది ఆ సమయం 15 నుంచి 16 గంటలకు తగ్గుతుంది.
చెన్నై నుంచి కోల్కత్తా మధ్య ప్రస్తుతం 25 గంటలు పడుతున్న ప్రయాణ సమయం 13 _14 గంటలు తగ్గుతుంది.
భారతీయ రైల్వేకు చతుర్భుజి ప్రాజెక్టుతో నిజంగానే బంగారు యుగం వస్తుంది.