భారతీయుల రక్తం మరుగుతోంది, ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు

జమ్మూ కాశ్మీర్ లోని 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద ముఠా బలితీసుకోవడం పై భారతావని దిగ్భాంతి లో మునిగిపోయింది.
ఆగ్రహం, ఆక్రోశంతో రగిలిపోయింది, ఉన్మాద చర్యలతో రక్తపుటేరులు పారిస్తున్నారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.
ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని సిఆర్పిఎఫ్ స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న పొరుగు దేశం పై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అంతర్జాతీయంగా ఏకాకిని చేసే ప్రయత్నాలను మొదలు పెట్టింది.
పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే ఎ మహ్మద్ ఉగ్రవాది ముఠాకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో గురువారం సిఆర్పిఎఫ్ బస్సును ఢీ కొట్టడం వలన జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో గురువారం 40 మంది జవాన్లు దుర్మరణం పాలయ్యారు.

అమరుల మృతదేహాలను శుక్రవారం సాయంత్రం వైమానిక దళానికి చెందిన విమానంలో శ్రీనగర్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. త్రివర్ణ పతాకాలు కప్పిన శవ పేటికలను విమానాశ్రయంలోని పాలిటెక్నికల్ ఏరియా లో ఉంచారు.
అక్కడికి తరలి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ,రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, పలువురు మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు లు , కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
త్రివిధ దళాధిపతులు అమర వీరులకు నివాళులర్పించారు, ఒక వేదికపై పుష్పగుచ్ఛాన్ని ఉంచిన ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు కొద్దిసేపు మౌనం పాటించారు.
ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి, జమ్ము నజమ్ము నగరం లో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి, అక్కడ కర్ఫ్యూను బైక్ ఆఫర్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పలు చోట్ల పోలీసులు లాఠీఛార్జి చేశారు ఆందోళనకారులు టైర్లు తగులబెట్టి రోడ్లపై అడ్డంకులు సృష్టించారు, 5 వాహనాలను తగలబెట్టారు ,పలుచోట్ల రాళ్ల దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు, సంస్థలతో పాటు, విద్యార్థులు ఆందోళనలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
పాకిస్థాన్ జెండాను ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు బుద్ధి చెప్పాలని కోరారు.