పుల్వామా దాడి ఓ భయంకరమైన పరిస్థితి

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రపంచంలోని పలు దేశాధినేతలు, ప్రధానులు భారత్‌కు మద్దుతుగా నిలుస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దీనిని తీవ్రంగా ఖండించారు.

  • 1.పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
  • 2.ఒకవేళ భారత్, పాకిస్థాన్ కలిస్తే అద్భుతమే అవుతుందంటూ వ్యాఖ్యలు.

ఉగ్రదాడిపై తమ వద్ద నివేదికలు ఉన్నాయని, సరైన సమయంలో స్పందిస్తామన్న ట్రంప్.

పుల్వామా ఆత్మాహుతి దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని భయంకరమైన పరిస్థితిగా ఆయన అభివర్ణిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

అలాగే ప్రత్యేకంగా భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికారప్రతినిధి రాబర్ట్ పల్లాడినో, ఫిబ్రవరి 14 ఉగ్రదాడికి కారణమైన వారు ఎవరైనా పాకిస్థాన్ శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు.

పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రికత్తలు చోటుచేసుకున్న తరుణంలో ట్రంప్ స్పందిస్తూ.. ఒకవేళ ఈ రెండు దక్షిణాసియా దేశాలు కలిస్తే అద్భుతమే అవుతుందని వ్యాఖ్యానించారు.

‘ఫిబ్రవరి 14 దాడి తర్వాత భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నానని, దీనిపై పలు నివేదికలను కూడా సేకరించాను.. దీనిపై సరైన సమయంలోనే వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవేళ ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే అద్భుతమేనని’ మీడియా అడిగి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

అయితే, ఆత్మాహుతి దాడి భయంకరమైన పరిస్థితి అని, దీనిపై తమకు నివేదిక ఉందని తెలిపారు.

మరోవైపు, అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి సైతం మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తో తమకు బలమైన సంబంధాలున్నాయని, ఈ ఉగ్రదాడికి తమ సంతాపంతోనే సరిపెట్టబోమని, వారికి పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు.

అలాగే పాకిస్థాన్ సైతం ఈ కేసు విషయంలో దర్యాప్తునకు సహకరించాలని, బాధ్యులెవరైనా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాదు పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో తాము మాట్లాడామని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రదాడి జరిగిన మర్నాడే అమెరికా జాతీయ భద్రతా సలహదారు కూడా ఫోన్‌చేసి మద్దతు తెలపగా, విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా పాక్‌పై నిప్పులు చెరిగారు.

అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా ఉగ్రదాడిని ఖండిస్తూ ట్వీట్‌ చేశారు.

‘ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మేం అండగా ఉంటాం. అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం ఇవ్వకూడదు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇవ్వడాన్ని, సాయం అందించడాన్ని తక్షణమే మానుకోవాలని పాకిస్థాన్‌కు అమెరికా ఇటీవలే గట్టి హెచ్చరిక చేసింది.

భూభాగంలోని అన్ని ఉగ్రవాద సంస్థలకు తక్షణమే పాకిస్థాన్ మద్దతు ఉపసహరించాలని, పుల్వామా ఉగ్రదాడి అత్యంత హేయమైనదని అమెరికా మండిపడింది.

‘పుల్వామా ఘటనపై సంతాపం తెలియజేసేందుకు అజిత్‌ దోవల్‌తో మాట్లాడాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ ఆత్మరక్షణ చర్యలను మేం సమర్థిస్తాం.. జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు స్వర్గంగా మారిన పాక్‌పై పోరాటానికి కలిసి పనిచేస్తాం..

ఈ విషయంలో ఆ దేశానికి చాలా హెచ్చరికలు చేశామని బోల్టన్‌ వ్యాఖ్యానించారు.

జైషే మహ్మద్ నేత మౌలానా మసూద్ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించేందుకు ఎదురవుతోన్న ఆటంకాలను తొలగించాలని, ఐరాసలో పాకిస్థాన్ దోషిగా నిలబెట్టి, ఏకాకిని చేయాలని.

ఈ సందర్భంగా ఇరువురూ చర్చింనట్టు విదేశాంగ శాఖ తెలిపింది.

దీనికి మద్దతు తెలిపిన అమెరికా భద్రతా సలహాదారు బోల్టన్, సరిహద్దుల్లో ఉగ్రవాదం, దాన్ని ప్రోత్సహించేవారిపై చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని, ఈ విషయంలో తమ సహకారం ఉంటుందని తెలిపారు.

ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌ను తన వైఖరి మార్చుకోవాలని చాలా సార్లు చెప్పామని, ఈ విషయంలో తమకు స్పష్టమైన సమాచారం ఉందని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *