ప్రియాంక హవాతో… కల్లోలం గా మారిన కూటమి…

కాంగ్రెస్ ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రియాంక వాద్రా రంగంలోకి దిగారు.

అచ్చంగా నానమ్మ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంకను చూసి యుపి కాంగ్రెస్ జనాలు ఫిదా అవ్వడం ఖాయం.

ఆమె రోడ్ షోకు భలే స్పందన వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

కానీ అదే సమయంలో మోడీపై ఐక్యపోరుకు ఈ వ్యవహారం గండికొట్టేలా కనిపిస్తోంది అని భావిస్తున్నారు.

ఎందుకంటే యుపిలో అధికారం కోసం పోటీపడే ఎస్ పి, బిఎస్పీలు రెండూ వైరాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి, ఒక్కతాటిపైకి వచ్చాయి.

కానీ ఇప్పుడు ప్రియాంక వ్యవహారం ఆదిలో అలాచూసి చూడనట్లు వదిలేస్తే, చాలాకాలం తరువాత కాంగ్రెస్ కు ఆ రాష్ట్రంలో మంచిరోజులు వచ్చే అవకాశం ఉంది.

ప్రమాదం వుందన్న కలవరం ఆ రెండు పార్టీలకు మొదలైంది.

అప్పడే కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందానికి రెండుపార్టీలు ఎవరి ప్రయత్నాలు అవి ప్రారంభించాయి.

సహజంగా ఇది, రెండో పక్షాన్ని మోడీ వ్యతిరేక ఐక్య కూటమికి దూరం చేస్తాయి.

ఇక బెంగాల్ కు వస్తే, దీదీ మమతకు పిఎమ్ పోస్ట్ మీద విపరీతమైన ఆశ వుంది. అది ఇవ్వాళ నిన్నటిది కాదు.

ఇప్పుడు ప్రియాంకనో, రాహుల్ నో గద్దెనెక్కించడానికి తామంతా కృషి చేయాలా? అన్న ఆలోచన మొదలవుతుంది.

కేవలం రాహుల్ ఒక్కరే అయితే ఆ చరిష్మా రేంజ్ వేరు, కాంగ్రెస్ కు వచ్చే సీట్లు వేరు. అప్పుడు బేరాలు, లెక్కలు, కూడికలు, తీసివేతలు వుంటాయి. దీదీకి కాస్త ఆశలు వుంటాయి.

కానీ ప్రియాంక చరిష్మా ఫలించి, కాంగ్రెస్ కు ఉత్తరంలో కాస్త ఎక్కువ సీట్లు వస్తే, దీదీ ఆశలు గల్లంతు అవుతాయి.

అప్పుడు కూడా మళ్లీ కూటమికి సమస్య గా మారుతుంది. అయితే ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఊపు అందుకునే సమస్యలు కావు.

ఎన్నికల అనంతరం సంభవించే పరిణామాలు మాత్రమే. కానీ సమస్య ఏమిటంటే, కూటమి మీద గతంలో వున్నంత ఆసక్తి ఇకపై వుండడంలో మాత్రం ప్రియాంక ఎంట్రీ కొంత ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *