ప్రియాంక క్రేజ్ కాంగ్రెస్ పార్టీపై అదనపు బలమే

కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ మనుమరాలు, రాజీవ్ గాంధీ తనయ, ప్రియాంక గాంధీకి మంచి క్రేజ్ ఉంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రియాంక రాక కోసం అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు తెలిపారు.

ప్రియాంక లో దేశ ప్రజలు ఇందిరాగాంధీని చూసుకుంటున్నారని, ఆమె పార్టీకి అదనపు బలం అవుతుంది అని అన్నారు

.Priyanka Craze is an extra fortune on the Congress party

రాజీవ్ గాంధీని ‘రాహుల్’ లోను ఇందిరా గాంధీని ‘ప్రియాంక’ లోను ప్రజలు చూసుకుంటున్నారు అని ఆయన అన్నారు.

రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ ఎన్నికల్లో రాహుల్ తన సమర్థతను చూపించారని కొనియాడారు. రాహుల్ మంచి వ్యూహకర్త అని ప్రశంసల వర్షం కురిపించారు.

తెలంగాణలో కూడా ప్రియాంక గాంధీ ప్రభావం ఉంటుందని చెప్పారు. రాహుల్ కానీ ప్రియాంక కానీ మెదక్ నుండి పోటీ చేస్తే గెలిపిస్తామని అన్నారు.

సీఎల్పీ నేత బట్టి కి పూర్తి మద్దతు ఇస్తున్నామని అన్నారు. బట్టి ని వ్యతిరేకిస్తే రాహుల్ ని వ్యతిరేకించినట్లే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *