ప్రజారాజ్యం, జనసేన ఒక్కటే.!

అన్న ప్రజారాజ్యానికి, తమ్ముడు జనసేనకు చాలా తేడాలు ఉన్నట్లే.. కొన్ని పోలికలు కూడా ఉన్నాయి.

అన్న చిరంజీవి కట్టే కొట్టే తెచ్చే

ఇలా పార్టీ పెట్టి, అలా విలీనం చేసి దుకాణం మూసేసారు. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటం చేస్తానంటూ ముందు నుంచి శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.

అయితే ఒక్క విషయం లో మాత్రం ప్ప్రజారాజ్యం జాడ్యాన్ని జనసేన వదులుకోలేక పోతోంది. ప్రజారాజ్యం లో సీరియస్ పొలిటీషియన్ లకు కొదవలేదు కానీ కొంతమంది మేధావి వర్గం చిరంజీవి చుట్టూ చేరి రాజకీయ వ్యవహారాలను పలుచన చేశారు.

డాక్టర్ మిత్ర, పరకాల ప్రభాకర్ టీం… చిరంజీవి చుట్టూ ఒక రకమైన మూడు క్రియేట్ చేసి పెట్టింది. ప్రజలో కలవలేని, మాస్ పల్స్ తెలియని సోకాల్డ్ మేధావులు అంతా ప్రజారాజ్యం లో ఓ గ్రూప్ గ్గా ఏర్పడ్డారు.

చివరకు ఆ గ్రూప్ అంతా చిరంజీవి ని తిట్టి బయటకు వెళ్ళిపోయింది. అసలు సిసలైన రాజకీయ నాయకుడు మాత్రమే ప్రజారాజ్యం కథ ముగిసిన తమ పొలిటికల్ కెరీర్ కి డోకా లేకుండా కొనసాగుతున్నారు.

కొన్ని రోజులుగా జనసేన లో చేరుతున్న వారిని చూస్తుంటే మరో ప్రజారాజ్యం ల మారుతుందని అనుమానాలు బలపడుతున్నాయి.

విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, భారతరత్న అబ్దుల్ కలాం లాంటి దిగ్గజాలకు అడ్వైజర్ లు గా పని చేసిన వ్యక్తులు… ఇలా మేధావి వర్గం అంతా పవన్ చుట్టూ చేరుతోంది.

అధికారం చేసుకోవాలన్న, రాజకీయ రణరంగంలో ఎత్తులకు పైఎత్తులు వేసి ఎదుటివారిని చేయాలన్నా ఈ మేధావి వర్గం తో ఎలాంటి ఉపయోగం లేదు.

వీరికి ఓ పార్టీకి చెప్పుకోదగ్గ ప్రయోజనం లేకపోగా లేనిపోని సలహాలతో కళ్యాణ్ ని కన్ఫ్యూషన్ లోకి నెట్టే ప్రమాదం ఉంది.

ఒకరకంగా వీరంతా బోల్డన్ని ఆశయాలు, ఆలోచనలు, ఆదర్శాలతో రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ వాస్తవాలు వేరు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో జనసేనకు కావాల్సింది మేధావులు కాదు.

ప్రాక్టికల్ పొలిటిషన్ కావాలి, ఎత్తుకు పై ఎత్తు వేయగల అసలు సిసలైన రాజకీయ నాయకుల అవసరం ఉంది.

అప్పుడు మాత్రమే ఎన్నికల్లో జనసేన కాస్తో కూస్తో నిలబడగలుగుతుంది. ఆ దిశగా జనసేనని కార్యాచరణ వుంటే మంచిది ‌.

ఇలా ఉద్యోగులు, రచయితలు, మాజీ లతో పార్టీని నింపుకుంటూ పోతే చివరకు మాటలు చెప్పే వారే మిగులుతారు.

ఈ విషయంలో జనసేన పార్టీ, ప్రజారాజ్యం సెంటిమెంట్ కు బలి కాకుండా ఉంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *