తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 17 నే పోలింగ్?

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ లు దాదాపు ఖరారయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఈ రెండు రాష్ట్రాలు ఐదేళ్లక్రితం ఉమ్మడి రాష్ట్రాలు కావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఏపీలు, 25 లోక్ సభ సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 28,80,680 మంది ఓటర్లు ఉండగా, ఏపీలో 3, 69, కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏప్రిల్ 30, మే 7తేదీ న తేదీన ఎన్నికలు పోలింగ్ నిర్వహించారు.

రెండు రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించడానికి ఒకటి రెండు కారణాలు ఉన్నాయి. ఏపీలో ఓటర్లు తెలంగాణలో ఓటు వేయకుండా, తెలంగాణ ఓటర్లు ఏపీ లో ఓటు వేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు నిర్వహించడం వలన శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదికలు అందాయి.

టిఆర్ఎస్ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు నిర్వహించవదని పట్టుబడుతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం అందజేసింది.

రెండు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో పోలింగ్ జరిగితే తెలంగాణ ఓటర్లు ఏపీ కి వెళ్లి ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసే ప్రమాదం ఉందనేది టిఆర్ఎస్ వాదన.

ఎట్టి పరిస్థితుల్లో అక్కడి ఓటర్లు ఇక్కడ, ఇక్కడి ఓటరు లు అక్కడ పోలింగ్లో పాల్గొనకుండా ఉండేందుకు టిఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ను ఒప్పించే ప్రయత్నం చేసింది అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *