అమెరికాలో 200 తెలుగు విద్యార్థులుఅరెస్టు, రంగంలోకి దిగిన తెలుగు సంఘాలు

అమెరికాలో తెలుగు విద్యార్థులను అరెస్టు చేశారు. బాధితులతో తెలుగు సంఘాల ప్రతినిధులు ఫోన్లో మాట్లాడుతున్నారు. వారికి న్యాయం సహాయం అందించేందుకు అటారీలను సంప్రదిస్తున్నారు.

న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. పాత విద్యార్థుల వీసా స్టేటస్ ఫ్రీజ్ అయినట్లేనని సమాచారం.

ప్రత్యమనయo చూస్తున్నాం. అరెస్ట్ అయిన వారిని విడిపించేందుకు బెయలు బాండ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. నిజానికి దొరకడం చాలా కష్టం అంటున్నారు తానా ప్రతినిధి అశోక్ కొల్లా.

ఈ వ్యవహారంలో తానా తరపున ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. తెలుగు విద్యార్థులకు అన్నివిధాల సహాయ పడ్డానికి కృషి చేస్తున్నామని తానా అధ్యక్షుడు సతీష్ రమణ చెప్పారు.

మన వాళ్ళు కొందరు తప్పు చేశారు, ఇంకొందరు ఆ ఉచ్చులో పడ్డారు. తప్పుచేసిన వారు శిక్ష పడాల్సిందే. తెలియక ఇరుక్కున్న వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని బాధితుల విద్యార్థులకు న్యాయం చేయాలని తానా వర్కింగ్ ప్రెసిడెంట్ జయశంకర్ కోరారు.

ఆయన ప్రవాసాంద్రులు పలు పూరి సతీష్, కసుకుర్తి రాజా తో కలిసి న్యూయార్క్లోని భారత కన్సల్టెంట్ కౌన్సిల్ జనరల్ సందీప్ చక్రవర్తి కలిశారు.

బాధిత విద్యార్థులు ఖమ్మం జిల్లాకు చెందినవారు కూడా ఉండటంతో ఇక్కడ వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అమెరికాలో రి కూటరలు గా వ్యవహరించి అరెస్టైన ఎనిమిది మంది విద్యార్థులకు కౌన్సిలల్ యాక్సెస్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.

తెలుగు విద్యార్థులను విడుదల చేయడానికి చొరవ తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అమెరికా రాయబారి కెన్నెల్ జూస్టర్ లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు లేఖలు రాశారు.

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఏపీ రెసిడెన్సి తెలుగు సొసైటీ ఏ పి ఎన్ ఆర్ టి ముందుకు వచ్చింది.

మీ పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి భయపడవలసిన అవసరం లేదని, ఏపీఏన్ఆరీటి పార్టీ అధ్యక్షుడు రవి కుమార్, సీఈవో భవాని శంకర్ భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *