దయచేసి నాగార్జునసాగర్‌కు ఎవరూ రావొద్దు..

Srisailam Dam: ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది.
ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది.
వరద నీటితో జలాశయం కళకళలాడుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించిన 16 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
ఆ సుందర దృశ్యాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూడటానికి పర్యాటకులు ఎవరూ అక్కడికి రావొద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు వద్దకు రావడం కూడా ప్రమాదకరమని తెలిపారు.
నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
సాగర్‌కు దారి తీసే రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాలతో కృష్ణా పరీవాహ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. డ్యామ్‌లన్నీ నిండుకుండలా మారాయి.
కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండటమే కాకుండా.. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారాయి.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 883.2 అడుగులకు చేరుకుంది.
ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తున్నాయి. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్‌కు వరద నీరు భారీగా చేరుకుంటోంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 587.50 అడుగులుగా ఉంది.
ఆదివారం (ఆగస్టు 23) ఉదయం సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,70,903 క్యూసెక్కులు ఉంది.
ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 305.84 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు.