పుల్వామాలో అమరులైన జవాన్ల కుటుంబాలకు పెన్షన్ రాదు.. నిజమేనా?

పుల్వామాలో జైషే మహ్మద్ సంస్థ ఉగ్రదాడితో నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అయితే దాడి జరిగిన రోజు నుంచి నేటివరకు జవాన్లకు సంబంధించి ఏదో విషయం షేర్ చేస్తున్నారు.

  • 1.పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లు
  • 2.ఆ అమర జవాన్ల కుటుంబాలకు పెన్షన్ రాదని పోస్టులు
  • 3.ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేసిన పోస్టుతో ఆందోళన మొదలైంది .

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తమ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ అమర జవాన్ల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ అమర జవాన్లలో 75 శాతం జవాన్ల కుటుంబాలకు పెన్షన్ రాదని ఆప్ పార్టీ తమ పోస్టులో పేర్కొంది.

అమర జవాన్ల శవపేటికను కొందరు పోలీసులు మోస్తున్న ఫొటోను ఆప్ పోస్ట్ చేసింది.

‘పుల్వామా దాడిలో అమరులైన వారిలో 75 శాతం జవాన్ల కుటుంబాలకు పెన్షన్ రాదు. 2004 తర్వాత వారు సర్వీసులో చేరడమే అందుకు కారణమని’ పోస్టులో రాసుకొచ్చారు.

వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఈ పోస్టును విపరీతంగా షేర్ చేస్తున్నారు.

సీఆర్పీఎఫ్ అమర జవాన్ల కుటుంబాలకు పెన్షన్ రాదు అనే ప్రచారంలో వాస్తవం లేదు.

అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ విధానంలో జనవరి 1, 2004 నుంచి మార్పులు తీసుకొచ్చారన్నది మాత్రం నిజం.

టైమ్స్ ఆఫ్ ఇండియా గతలో ఇచ్చిన కథనాన్ని పరిశీలిస్తే.. జనవరి 1, 2004 నుంచి నియామకం అవుతున్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేశారని, ఉద్యోగుల నెల జీతం నుంచి కొంతమేర నగదును రిటైర్మెంటయ్యే వరకు కోత విధిస్తారని, అంతే మొత్తం నగదును ప్రభుత్వం ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ మొత్తంలో జమ చేస్తుంది.

ఉద్యోగి వార్షిక జీతంలో 10 శాతం మేర ప్రభుత్వం నగదు జమ చేయాల్సి ఉంటుందన్న నిబంధన ఉంది.

సీఆర్పీఎఫ్ అధికారులు ఇటీవల అమర జవాన్ల పెన్షన్‌కకు సంబంధించి ఓ లేఖ విడుదల చేశారు.

అమర జవాన్ల భార్యలకు విధులు నిర్వహిస్తున్నప్పుడు భర్త తీసుకున్న నెల జీతాన్ని మొత్తం పెన్షన్‌గా చెల్లిస్తాం.

జవాను అవివాహితుడై తల్లిదండ్రులు ఇద్దరూ జీవించి ఉంటే జీతంలో 75శాతం నగదును, పేరెంట్స్‌లో ఒక్కరు మాత్రమే జీవించి ఉంటే అమర జవాన్ జీతం నగదులో 60శాతం మొత్తాన్ని పెన్షన్‌గా అందించనున్నట్లు లేఖలో ఉంది.

ఎంపీలు రాజీవ్ సతావ్, డాక్టర్ హీనా గవిత్‌లకు కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించిన సమాధానాలను 2018లో పత్రాలను అందించింది.

Govt letter

సీఏఎస్‌ఎఫ్ (అస్సాం రైఫిల్స్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సీఐఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) బలగాలకు చెందిన జవాన్లు చనిపోతే కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ.35 లక్షల పరిహారం అందిస్తుంది.

సీఏఎస్‌ఎఫ్ అమర జవాన్ల కుటుంబాలకు భద్రతా సంబంధిత వ్యయం (ఎస్‌ఆర్ఈ) కింద మరో 20 లక్షలు పరిహారం చెల్లిస్తుంది.

సంబంధిత రాష్ట్రాలు జవాన్ల కుటుంబాలకు లిబరలైజ్‌డ్ పెన్షన్ అవార్డు (ఎల్‌పీఏ) ను అందజేస్తాయి. అధికంగా రూ.5 లక్షల మేర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది.

సీఏపీఎఫ్ సిబ్బంది చనిపోతే పరిహారం ఏమిస్తారని గతంలో లోక్‌సభలో ప్రశ్నను సంధించారు.

ప్రస్తుత నియమాల ప్రకారం రూ.15 లక్షలు నష్టపరిహారంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు, పరిహారం వారి కుటుంబాలకు చెల్లిస్తామని.. ఎంపీ నీలం సంకెర్ డిసెంబర్ 22, 2015న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజీజు రాతపూర్వక సమాధానమిచ్చారు.

పుల్వామాలో జరిగిన దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కూడా ఎల్‌పీఏ కింద నష్టపరిహారం అందుతుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *