అప్లికేషన్ విధానంతో అభ్యర్థుల ఎంపిక కొత్త విధానం తో పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ కమిటీ లో అవకాశం కోసం జనసేన అభ్యర్థులంతా ఎదురు చూస్తూ ఉంటే, పిడుగులా అసెంబ్లీ టికెట్ల కోసం అప్లికేషన్ స్వీకరించడం అనే పద్ధతిని మదలుపెట్టాడు జనసేనాని.

దీనికోసం ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

ఈ స్క్రీనింగ్ కమిటీలో మాదాసు గంగాధరం, ఆరాం ఖాన్, హరి ప్రసాద్, మహేందర్ రెడ్డి, శివ శంకర్… ఐదుగురు సభ్యులుగా ఉంటారు.

వీరంతా టికెట్లు ఆశిస్తున్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆర్థిక, వ్యక్తిగత బలం, పోరాట బలం, గెలిచే సమర్ధత, సామాజిక అంశాలపై స్పందన, నిబద్ధత.. ఇలాంటి కొలమానాలతో కమిటీ అభ్యర్థులను ఎంపికచేయడం జరుగుతుంది.

పవన్ సూచించిన ఈ క్వాలిటీ లు వాడిలో ఉన్నాయో లేదో గమనించి స్క్రీనింగ్ కమిటీ ఎంపికను జరుపుతుంది.

ప్రతి నియోజకవర్గం నుంచి ఆశావహులను ఎంపిక చేసి వారి బలాబలాలను లెక్కలు కట్టి స్క్రీనింగ్ కమిటీ ఒక నివేదికను తయారు చేస్తుంది.

ఆ రిపోర్ట్ ని అనుసరించి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సర్వే పడుతుంది. నిలబడిన వారి list పార్టీ జనరల్ బాడీ కి వెళ్తుంది. జనరల్ బాడీ ఖరారు చేసిన వారికి పార్టీ బి ఫారం దొరుకుతుంది.

రిజెక్ట్ చేసిన వాడికి పార్టీ పదవులు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇలా జనసేన పార్టీ ఒకేసారి పదవులు అసెంబ్లీ టిక్కెట్లు కలిపి అప్లికేషన్ తీసుకుంటున్నారు .

అయితే ఈ ప్రక్రియ అంతా కేవలం చెప్పుకోవడానికి మాత్రమే అని జనసైనికులు అంటున్నారు. చివరికి పార్టీ కి ఉపయోగపడే అంగబలం, అర్థబలం ఉన్నవాళ్లకి జనసేన టిక్కెట్లు దక్కుతాయని బహిరంగంగానే అంటున్నారు .

ఇక పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లుగా 80 శాతం కొత్తవారికి ఇవ్వడమనే ది జరిగే పని కాదు. 33 శాతం మహిళలకు సీట్లు if వచ్చేమో కానీ 80 శాతం కొత్త మందికి అవకాశం ఇస్తే అది మొదటికే మోసం తెచ్చిపెడుతుంది.

ప్రజారాజ్యం లో జరిగినట్లు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని అనుసరించకుండా పవన్ కళ్యాణ్ కొత్తగా అప్లికేషన్ విధానంతో try చేస్తున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *