జనసేన కీలక నేత రాజీనామాతో పవన్ అలర్ట్…

ఆశావహుల నుంచి పది రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ త్వరలో నియోజక, మండల కమిటీలు అన్ని వర్గాలకు సమ ప్రతినిత్యం జరుగుతోంది. పవన్ అభిమానులకు చోటు.. బహిరంగ అసంతృప్తిపై క్రమశిక్షణ.
వచ్చే స్వాతంత్ర ఎన్నికల్లో పోటీకి వీలుగా తన సైన్యాన్ని రంగంలోకి దించాలంటు జనసేన భావిస్తోంది. దీనికి నియోజక వర్గాల వారిగా సంసిద్ధం చేసి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
రాజకీయ యోగ్యత లతోపాటు సేవారంగంలో అనుభవం, ప్రజలతో సాన్నిహిత్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ పది రోజుల పాటు ఈ ప్రక్రియను కొనసాగించనున్నారు..
ఇందుకోసం నియమించిన స్క్రీనింగ్ కమిటీకి ఈ బాధ్యతను అప్పచెప్పారు.
మరోవైపు క్షేత్రస్థాయిలో బలం నిరూపించుకునేందుకు 1, రెండుసార్లు జనసేన అధిపతి నియోజకవర్గాలలో పర్యటించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతోంది.
పార్టీ పర్యవేక్షణ బాధ్యతలను మరింత దగ్గర నుండి పర్యవేక్షించేందుకు పార్లమెంటరీ కమిటీలకు బరువైన బాధ్యతలను అప్పగించి పోతున్నారంటూ సమాచారం.
పార్లమెంటరీ నియోజకవర్గం లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో నేతలను కలుపుకుని క్షేత్ర స్థాయి వరకు పార్టీని విస్తరించేలా జనసేన వ్యూహం రూపొందిస్తోంది.
జిల్లాలో ఏం చేయబోతున్నారు అంటే పార్టీకి జన బలం ఉంది. వేలాది మంది అభిమానులు కూడా ఉన్నారు.
పార్టీని నడిపించగల సత్తా కలిగిన వాళ్లు కూడా ఉన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకొని పార్టీ ఇప్పుడు కాస్త వేగం పెంచాలని భావిస్తోంది.
పార్లమెంటరీ కమిటీ లను నియమించినట్లు నియోజకవర్గ, మండల కమిటీలను సాధ్యమైనంత త్వరలో ప్రకటించనున్నారు.
వీలైతే ఈ వారంలోనే కమిటీ లన్నిటికీ రూపకల్పన చేయాలని ఆ బాధ్యతలను సీనియర్లకు అప్పగించారు.
ఇప్పటికే ప్రకటించిన కమిటీలలో సామాజిక సమతుల్యం పూర్తిగా పాటించామని, ఇక ముందు ఇదే వాతావరణం ఉంటుందని నేతలు వెల్లడించారు. ని
యోజకవర్గ కమిటీలలో టికెట్ ఆశిస్తూ వారితో పాటు పవన్ అభిమానులకు పెద్ద ఎత్తున చోటు కల్పిస్తున్నారు.
ఇదే కోణంలో మండల కమిటీలను తీర్చిదిద్దే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన కమిటీలలో చోటు దక్కలేదని కొందరు అసహనంగా కూడా ఉన్నారు. ఒక ఇద్దరు రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ పరిణామాలకు జనసేన పరిశీలనలోకి తీసుకుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని చెప్పింది. కమిటీ లో ఎక్కువ మందికి చోటు కల్పించడం ద్వారా అసంతృప్తిని చల్లబరిచే ప్రయత్నం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా జనసేన ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి తన సభ్యత్వానికి,పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
నియోజకవర్గాలలో భారీ డిమాండ్ జనసేన నుంచి పోటీచేయాలని తహతహలాడుతున్న వారి సంఖ్య భారీగా కనిపిస్తోంది.
ఇప్పటికే పార్టీ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్న వారంతా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు.
దీనికితోడు జనసేన అధిపతి పవన్ కు చేరువగా ఉన్న నేతలతో సత్సంబంధాలకు ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు.
ఇదే తరుణంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పది మందికి తగ్గకుండా ఆశావాహులు దరఖాస్తు చేస్తారని అంచనా వేస్తున్నారు.
దీని ప్రకారం 15 నియోజకవర్గాలకు నిరసనగా 250కి పైగా నే ఆశావహులు క్యూ కట్టబోతున్నారు. వీరంతా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ ఎదుట దరఖాస్తు చేసుకోవాలి.
స్క్రీనింగ్ కమిటీలో మహేంద్ర రెడ్డి, హరి ప్రసాద్, మాదాసు గంగాధరం, శివ శంకర,రియాజ్ ఖాన్ ఉన్నారు. తమకు అందిన దరఖాస్తులను వడబోసి త్వరలోనే పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు అందజే యబోతున్నారు.
వరుసగా పది రోజులపాటు దరఖాస్తులు స్వీకరించి నెలాఖరు నాటికల్లా.. చేతికి అందిన దరఖాస్తులను అన్ని కోణాల్లో పరిశీలించి.. తరువాత నియోజకవర్గ స్థాయిలో ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారిస్తారు.
పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ కాస్తా తక్కువగానే ఉన్నా.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం అత్యధికులు పోటీకి సై అంటు న్నారు.
దీనికి సంబంధించి ప్రత్యేకంగా దరఖాస్తు అంటూ ఏమీ లేకపోయినా సాధారణ వివరాలతో పొందుపర్చాల్సి ఉంటుంది అని చెప్పారు.
పార్టీలో క్రమ‘శిక్ష’ణే..
ఇటీవల పార్టీ ప్రకటించిన కమిటీల్లో చోటు దక్కలేదని, బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలపై కాస్తంత కఠినంగానే వ్యవహరించాలని జనసేన నాయకత్వం భావిస్తోంది.
ఇటీవల ఏలూరులో ఒకరిద్దరు నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలో ఇక ముందు పార్టీలో క్రమశిక్షణగా వ్యవహారాలు నడపాలని భావిస్తున్నారు.
దీనికి తగ్గట్టుగా ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకత్వానికి సున్నిహిత హెచ్చరికలు జారీ చేయబోతున్నారు